Friday, September 20, 2024
HomeఆటAsian Futsal Cup- 2023: ఫట్సల్ స్పోర్ట్స్ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్

Asian Futsal Cup- 2023: ఫట్సల్ స్పోర్ట్స్ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్

ఇండియన్ నేషనల్ ఫట్సల్ టీంకు ఎంపికైన ఐదుగురు జిల్లా వాసులు

మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ కు చెందిన ఫట్సల్ స్పోర్ట్స్ ఐదుగురు క్రీడాకారులు ఇబాదుల్లా ఖాన్, ఇబ్రహీం అలీ, షేక్ ఒమర్, జుబైర్ బిన్ సుల్తాన్, మొహమ్మద్ జవాధ్ హుస్సేన్ లు త్వరలో ఖతార్ లో జరగనున్న ఏషియన్ ఫట్సల్ కప్-2023 లో పాల్గొనే ఇండియన్ నేషనల్ ఫట్సల్ టీంకు ఎంపికైన సందర్భంగా ఢిల్లీలో జరగనున్న ప్రిపరేటరీ pre – camp కు వెళ్తున్న సందర్భంగా అభినందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి వేదికలపై రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నారన్నారు. ఖతార్ లో జరిగే ఏషియన్ Futsal కప్ కు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ వాసిఫ్ మక్తర్, మహబూబ్ నగర్ కౌన్సిలర్ మోసిన్, మైనారిటీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News