Sunday, October 6, 2024
Homeహెల్త్Seeds to skin glow: చర్మాన్ని మెరిపించే ఐదు గింజలు

Seeds to skin glow: చర్మాన్ని మెరిపించే ఐదు గింజలు

వీటిల్లో విటమిన్ ఇ, స్క్వాలెన్ పుష్కలంగా ఉంటుంది

చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచే గింజలు (సీడ్స్) కొన్ని ఉన్నాయి. వాటిల్లో గుమ్మడి గింజలు ఒకటి. ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. వీటిల్లో ఉండే మరో పదార్థం స్క్వాలెన్. సూర్యరశ్మి నుంచి చర్మం దెబ్బతినకుండా ఇవి రెండూ కాపాడతాయి. ఈ గింజల్లో జింకు పుష్కలంగా ఉంటుంది. అది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మం బ్రేకవుట్ కాకుండా కాపాడుతుంది. ఈ గింజల్లోని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చర్మం పట్టులా మ్రుదువుగా, కాంతివంతంగా ఉండేలా చేస్తాయి. ఈ గింజల్లో యాంటాక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం, శిరోజాల ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పరిరక్షిస్తాయి.

- Advertisement -

చర్మ ఆరోగ్యాన్ని కాపాడే మరో గింజలు చియా సీడ్స్. ఇవి చర్మానికి మంచి కూలింగ్ ఎఫెక్టును ఇస్తాయి. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. ఇవి చర్మం వాపు, ఇరిటేషన్లను తగ్గిస్తాయి. చియాలోని యాంటాక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అంతేకాదు ముఖంపై ముడతలు, ఫైన్ లైన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి. చర్మానికి మాయిశ్చరైజింగ్ కోసం, అలాగే చర్మం ఎక్స్ ఫొయిలేషన్ కు కూడా వీటిని ఉపయోగిస్తారు. వీటితో పాటు జీర్ణక్రియ బాగా జరిగేలా ఇవి తోడ్పడతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అందుకే డైట్ లో కూడా వీటిని వాడతారు.


సన్ ఫ్లవర్ సీడ్స్ కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో విటమిన్ ఇ, సెలీనియం, జింకులు పుష్కలంగా ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ అయిన లినోలెనిక్, ఒలిక్, పాల్మిటిక్ యాసిడ్ కూడా సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఉంటాయి. ఇవి కొల్లాజిన్ ఉత్పత్తిని అధికం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. చర్మం ఎలాస్టిసిటీ పెరగడానికి , యంగ్ లుక్ కనిపించడానికి డైట్ లో సైతం సన్ ఫ్లవర్ సీడ్స్ ను జోడించాలంటున్నారు పోషకాహార నిపుణులు. వీటిల్లోని యాంటాక్సిడెంట్ల వల్ల ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
నువ్వు గింజలు కూడా చర్మానికి ఎంతో మంచి చేస్తాయి. వీటిల్లో జింకు బాగా ఉంటుంది. అంతేకాదు ఈ గింజల్లో యాంటీ ఏజింగ్ సుగుణాలు ఎన్నో ఉన్నాయి. చర్మంపై ఏర్పడే ఎర్రటి దద్దుర్లను ఇవి తగ్గిస్తాయి. మంట, వాపు నుంచి సాంత్వన నిస్తాయి. నువ్వుల నూనె రాసుకోవడం వల్ల చర్మం పొడిబారదు. ఈ గింజల్లో యాంటాక్సిడెంట్లతో పాటు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు కూడా బాగా ఉన్నాయి. శిరోజాల ఆరోగ్యానికి కూడా నువ్వు గింజలు ఎంతగానో తోడ్పడతాయి.


ఇవి కాకుండా అవిశ గింజలు కూడా చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ గింజల్లో హెల్దీ ఫ్యాట్స్ బాగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత బాగా ఉంటుంది. దీంతో యాక్నే సమస్య తగ్గుతుంది. ఈ గింజల్లో సెలినియం, జింక్, ఇతర ఖనిజాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవి శరీరానికి, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిని డైట్ లో ఎలా తొనొచ్చంటే.. గుమ్మడి గింజలను నెయ్యి లేదా నూనెలో రోస్ట్ చేసి తినొచ్చు. సలాడ్, రకరకాల ఫుడ్స్ పై సీజనింగ్ కు కూడా వీటిని ఉపయోగించవచ్చు. చియా సీడ్స్ ను రకరకాల డ్రింకుల్లో వాడొచ్చు. కొబ్బరి నీళ్ల నుంచి ఫ్రూట్ స్మూదీల వరకూ వేటిల్లోనైనా ఈ గింజలను వాడొచ్చు. సన్ ఫ్లవర్ సీడ్స్ నైతే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ సలాడ్స్ పై చల్లితే కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి. సలాడ్ రుచి రెట్టింపు అవుతుంది. అవిశె గింజలను గ్రైండ్ చేసి ఆ పొడిని పెరుగులో కలుపుకుని తినొచ్చు. నువ్వులను తేనె లేదా బెల్లంతో
కలిపి ఉండలుగా చేసి తినొచ్చు. వీటికి మంచి పోషకాహారంగా పేరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News