తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేరేడుచర్ల పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనుల బ్రోచర్ విడుదల చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి టౌన్ హాల్ వరకు కోలాటాలతో, ఆటపాటలతో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనులపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు, కమిషనర్ కే. శ్రీనివాసరెడ్డి, సహకార సంఘం చైర్మన్ దొండపాటి అప్పిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాదెండ్ల శ్రీధర్, వార్డు కౌన్సిలర్లు, షేక్ షహనాజ్, షేక్ బాషా, అలక సరిత, కొదమగుండ్ల సరిత, బానోతు లలిత, నూకల సుగుణ, కుంకు సులోచన, గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, మాజీ సర్పంచ్ కొనటం సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, మెఫ్మా సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.