Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: హంద్రీ , తుంగభద్ర అనుసంధానంతోనే సాగునీరు

Emmiganuru: హంద్రీ , తుంగభద్ర అనుసంధానంతోనే సాగునీరు

ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డితో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటేష్ బేటి

ఎమ్మిగనూరు నియోజకవర్గం లోని గోనెగండ్ల , ఎమ్మిగనూరు , నందవరం మండలాలలోని చెరువులను అనుసంధానిస్తూ హంద్రీ నది తుంగభద్ర నదులను అనుసందానం చేయడం ద్వారా ప్రతి గ్రామంలోని వ్యవసాయ భూములకు పూర్తి స్థాయిలో నీరు అందుతుందని హైదరాబాదు డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ,సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఇ.వెంకటేశు అన్నారు. కర్నూలులోని మౌర్య ఇన్ హోటల్ లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డితో ప్రొఫెసర్ ఇ.వెంకటేశులు హంద్రీ, తుంగభద్ర నదులు అనుసందానంపై చర్చించారు. వ్యవసాయ భూములకు నీటి పారుదల సౌకర్యాల గురించి ప్రస్తావించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం లోని 3 మండలాలలో తరచూ కరువు తీవ్రత అధికంగా ఉండడం వలన గ్రామీణ ప్రాంతాల ప్రజలు నిత్యం వలసలు వెళుతున్నారు. వలసలు వెళ్ళకుండా వారు ఉన్న చోటనే ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి హంద్రీ నది , తుంగభద్ర నదులలో ప్రవహించే వరద నీటిని చెరువులలో గొలుసుకట్టు విధానం ద్వారా నిల్వ చేసుకోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ప్రొఫెసర్ ఇ. వెంకటేశు ఇచ్చిన ఈ సలహాకు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి స్పందిస్తూ ఇప్పటికే నియోజకవర్గంలోని గంజహళ్ళి ,బైలుప్పల గ్రామాల మధ్య ఎత్తిపోతల పథకం మంజూరైంది. ప్రొఫెసర్ సలహా మేరకు దశలవారీగా నిర్మిస్తామని అన్నారు. ఈ 2 నదుల మధ్య ఉన్న వ్యవసాయదారులకు ఉన్న ప్రధానమైన నీటి సమస్యలను పరిష్కరించడానికి విస్తృతంగా చర్చిస్తామని కూడా ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News