Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Telangana movement: దశాబ్ది ధైర్యం..తెగువ గల తెలంగాణ

Telangana movement: దశాబ్ది ధైర్యం..తెగువ గల తెలంగాణ

దాదాపు 60 సంవత్సరాలు కొనసాగిన ఉద్యమం

వెయ్యి గొంతుకల ఆకాంక్ష.. కన్నీటి గాధల భయానక అసమానతల అవమానాల తెలంగాణ యువత బలిదానాలతో బరిలో నిలబడ్డదంటే ఎన్ని అటు పోట్లను దిగమింగుకొని గుండెలవిసేలా రోదించిన బుల్లెట్లకు బదులిస్తూ విజయానీకె విద్య నేర్పిన ప్రతీక తెలంగాణ తెలంగాణ ఉద్యమం భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుండి నిజాం పాలించిన కొన్ని జిల్లాలను వేరుచేస్తూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని మొదలైన ఉద్యమం. ఇది దాదాపు 60 సంవత్సరాలు కొనసాగింది.
తెలంగాణ నేల తెగింపును ప్రసవించినట్లు పాట గొంతెత్తిన ఆర్దనాదం. ఆక్రోశగానం. ఉద్వేగభరితం. కరువొ చ్చినా పాట. కన్నీళ్ళు వచ్చినా పాట. కష్టాలు బతుకు మీద పొంగి పొరిలినా, నష్టాలు నట్టేట ముంచినా, సంబురాలు అంబరాన్ని తాకినా పాట. బతుకు కదలిక మీద పాట వాలని పరిస్థితిలేదు. పాట కిరణాలు ప్రసరించని ఉద్యమాన్ని ఊహించడం అతి కష్టం. సాంఘిక సమకాలీన పరి స్థితుల పరిమళాన్ని వీస్తుంది. సమాజాన్నీ దృశ్యీకరిస్తూనే శ్రావ్యంగా పండిత పామర జనరంజకంగా మనసులోకి ఇంకిపోతుంది. వస్తు వైవిధ్యం, విశ్లేషణ ద్వారా తెలంగాణ ఉద్యమ పరిణామక్రమం, పోరాట చరిత్ర, వికాసాలు ఎన్నో అంశాలను వివిధ కోణాల్లో విశ్లేషించి వర్తమాన భవిష్యత్తులకు తెలియజేస్తుంది. ఎన్నో ప్రక్రియలు సాహిత్యంలో ఉన్నప్పటికీ పాట చాలా సులువుగా త్వరగా స్పందింప జేస్తుంది. ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేస్తుంది. అందువల్ల ఉద్యమ గీతాల్లోని తెలంగాణ అస్థిత్వాన్ని సమగ్రంగా విశ్లేషించ గలుగుతుంది. అందువల్ల నేను పాటల్ని ఎక్కువ ఊటకించ దలుచుకున్నాను.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 1953 డిసెం బరులో, రాష్ట్రాల పునర్విభజన కమిషనును నియమించడం జరిగింది. ప్రజాభిప్రాయం ప్రకారం ఈ కమిషన్‌ హైదరా బాదు రాష్ట్రాన్ని విభజించి అందులో మరాఠీ భాష మాట్లాడే ప్రాంతాలను బొంబాయి రాష్ట్రంలోనూ, కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలను మైసూరు రాష్ట్రంలో కలిపివేయాలని సిఫారసు చేసింది. ఈ కమిషన్‌ నివేదికలో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడం వలన కలిగే లాభ నష్టా లను చర్చించి విలీనానికి మద్దతు ఆంధ్రభాగంలో ఎక్కువ గా వున్నప్పటికి, తెలంగాణ భాగంలో స్పష్టంగా లేకపోవ టంతో తెలంగాణ భాగాన్ని హైద్రాబాదు రాష్ట్రంగా ఏర్పాటు చేసి సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత హైదరా బాద్‌ రాష్ట్రం ప్రజాభిప్రాయం ప్రకారం విధాన సభలో విలీనం తీర్మానానికి మూడింట రెండు వంతుల ఆధిక్యత వస్తే విలీనం జరపాలని సూచించారు.
అయినప్పటికీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ నేతృత్వంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పెద్దమనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణ భద్రతలను అందించడం తర్వాత 1956, నవంబరు 1న ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ విలీనం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగింది.
1948లో పోలీస్‌ యాక్షన్‌ తర్వాత 1952లో సాధా రణ ఎన్నిక జరిగి ప్రభుత్వం ఏర్పడే వరకు హైదరాబాద్‌ రాష్ట్ర పాలనా యంత్రాంగం మిలిటరీ, సివిల్‌ అధికారుల పాలనలో ఉండటంవల్ల ఆంధ్ర ప్రాంతం నుంచి వలసలు నిరాటకంగా కొనసాగాయి. అదివరకే ఆంధ్ర ప్రాంతంలో బ్రిటీష్‌ వారి క్రింద శిక్షణ పొంది అనుభవం ఉన్న ఆ అధికారులను తెలంగాణకు రప్పించుకున్నారు. అప్పటికే హైదరాబాద్‌ రాష్ట్రంలో అమల్లో ఉన్నా ముల్కీ నిబంధనలను కాదని వలసవాదులకు ఉద్యోగాలు ఇచ్చారు. 1956లో ఆంధ్రరాష్ట్రం హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనమైన తర్వాత వలసలు మరింత పెరిగాయి. స్థానికులకు కేటాయించిన ఉద్యోగాలు స్థానికేతరుల పరమవుతూవచ్చాయి. పెద్దమనుషుల ఒప్పందంను గాలికొదిలేయడంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నిప్పు రాజుకుంది. ఖమ్మం జిల్లా పాల్వంచలోని థర్మల్‌ స్టేషన్లో పనిచేసే ఉద్యోగుల్లో మెజార్టీ ఉద్యోగలు ఆంధ్ర ప్రాంతం వారు కావడంతో 1969, జనవరి 5న తెలంగాణ ఉద్యోగులు నిరసనకు దిగారు. అప్పటి ఉద్యమ ప్రారంభానికి పాల్వంచనే పాదు వేసింది. జనవరి 10 నుంచి నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 2001 ఏప్రిల్‌ 27న అధికారికంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చెయ్యడంతో ప్రారంభమయింది. అప్పటి నుండి, ఈ ఉద్యమం ఎలా పురోగమించిందో, అక్షరబద్ధం చేసే విధం ఇది. కేవలం ఏమి జరిగింది, ఎవరు చెప్పారు, ఏమి చెప్పారు వంటి వాస్తవాల నివేదిక ఇది.
ఏప్రిల్‌ 27: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి, కె చంద్రశేఖర రావు తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనకై ఉద్యమించాడు. ఇందుకు గాను తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాడు. శాసనసభకు పూర్వపు సభాపతి – జి నారాయణ రావు కూడా ఆయనతో విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. మే 17న కరీంనగర్లో నిర్వహించే తెలంగాణ సింహగర్జన ద్వారా తమ బల ప్రదర్శన చేస్తామని ఆయన ప్రకటించాడు.
మే 2: తెలంగాణ రాష్ట్రం కొరకు జరిపే ఉద్యమం శాస్త్రీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా జరుగుతుందని, ఇతర ప్రాంతాల ప్రజలు భయపడన వసరం లేదని చంద్రశేఖర రావు చెప్పాడు.
సాగరహారం.. తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయి కి తీసుకెళ్లిన సందర్భం. లక్షల గొంతుకలు ఏకమయ్యి ‘జై తెలంగాణ’ అని నినదించిన రోజు. సకల జనులు మద్దతు పలికి.. పిడికిలి బిగించిన అపురూప ఉద్యమ ఘట్టం. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆనాడు చేపట్టిన సాగరహారంతో తెలంగాణ ఆకాంక్ష ప్రజల్లో ఎంత బలంగా ఉందో నాటి పాలకులకు అర్థం అయ్యింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఎందుకు ఏర్పడాలో ఢిల్లీ పెద్దలకు బోధపడింది. అందుకే ఉద్యమ సమయంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా.. సాగరహారానికి ప్రత్యేక స్థానం ఉంది. 2012 సెప్టెంబర్‌ 30న నిర్వహించిన సాగరహారంతో.. భాగ్యనగరం రణ రంగమైంది. పోలీసుల తూటాలు, లాఠీఛార్జ్‌, బాష్పవాయు ప్రయోగాలను లెక్క చేయకుండా.. బారీకేడ్లను తొలగించి, ముళ్ల కంచెల పైనుంచి దూకి తెలంగాణ వాదులు చీమల దండులా సాగరహారానికి తరలివచ్చారు. తెలంగాణ ప్రక టన వచ్చేవరకు సాగర్ను వదిలేదిలేదని నినాదాలు చేశారు. అప్పుడు కూడా ఉద్యమాన్ని అణచివేసేందుకు.. పాలకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కవాతు చేయడానికి వచ్చిన వారిపై పోలీసులు నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారు. అయి నా తెలంగాణవాదులు ఎలాంటి హింసామార్గాన్ని చేపట్ట కుండా.. లక్షలాదిగా తరలివచ్చి సాగరహారాన్ని విజయ వంతం చేశారు. అలాంటి ప్రజా ఉద్యమాల చేస్తున్న తెలం గాణ ప్రజల చిరకాల ఆకాంక్షను గుర్తించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం.. 2013 జూలై 30న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 18న లోక్సభ, ఫిబ్రవరి 20 రాజ్యసభ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపాయి. దీంతో ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరివేరింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు సంబురాలు జరుపుకున్నారు. నేడు అదే ఉద్యమ స్పూర్తితో.. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గత ఐదేళ్లలో సగటు వార్షిక వృద్ధి రేటు 13.90% సాధిస్తూ ఉంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. 2020-21 సంవత్సరానికి తెలంగాణ స్థూల దేశీయ ఉత్పత్తి రూ.12.05 లక్షల కోట్లు (యుఎస్‌ డా.170 బిలియన్లు)గా ఉంది. 2018-19 సంవత్సరంలో 65% వాటాతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సేవా రంగం అతిపెద్ద సహకారం అందించింది. ఉత్పత్తి, ఎగుమతుల పరంగా దేశంలో ఐటీ & ఐటీఈఎస్‌లో రాష్ట్రం అగ్రగామిగా ఉండటంతో సేవలలో వృద్ధి ఎక్కువగా ఐటీ సేవల ద్వారా ఊపందుకుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా ఉంది. భారతదేశంలోని రెండు ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణా ఈ రాష్ట్రం గుండా ప్రవహిస్తాయి, నీటిపారుదలని అందిస్తాయి. తెలంగాణలోని రైతులు సాగునీటి కోసం ప్రధానంగా వర్షాధార నీటి వనరులపై ఆధారపడుతున్నారు. ఇక్కడ వరి ప్రధాన ఆహార పంట. ఇతర ముఖ్యమైన స్థానిక పంటలు పత్తి, చెరకు, మామిడి, పొగాకు ఉన్నాయి. ఇటీవల, కూరగా యల నూనె ఉత్పత్తికి ఉపయోగించే పొద్దుతిరుగుడు, వేరు శెనగ వంటి పంటలు ఈ ప్రదేశంలో పండటానికి అనుకూలంగా ఉంటుంది. గోదావరి రివర్‌ బేసిన్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులతో సహా అనేక బహుళ-రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులు అభివృద్ధిలో ఉన్నాయి.
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయోటెక్నాలజీ రంగాలపై రాష్ట్రం దృష్టి సారించడం ప్రారంభించింది. రాష్ట్రంలో 68 ప్రత్యేక ఆర్థిక మండలాలు ఉన్నాయి. వరి రాష్ట్రంలోని ప్రధాన ఆహార పంట, ప్రధాన ఆహారం. పొగాకు, మామిడి, పత్తి, చెరకు అనేవి ఇతర ముఖ్యమైన పంటలు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరు. భారతదేశంలోని ముఖ్యమైన నదులు, గోదావరి, కృష్ణా నదులు రాష్ట్రం గుండా ప్రవహిస్తాయి, సాగునీటిని అందిస్తాయి. ప్రధాన నదులే కాకుండా తుంగభద్ర, బీమా, డిండి, కిన్నెరసాని, మంజీర, మానేరు, పెంగంగ, ప్రాణ హిత, పెద్దవాగు, తాలిపేరు వంటి చిన్న నదులు కూడా ఉన్నాయి. గోదావరి రివర్‌ బేసిన్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాతి డ్యామ్‌ నాగార్జున సాగర్‌ డ్యామ్తో సహా అనేక బహుళ-రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులు అభివృద్ధిలో ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి వార్షిక రుణ లక్ష్యాన్ని రూ .2.42 లక్షల కోట్లుగా నిర్దేశిం చింది, ఇది గత సంవత్సరం లక్ష్యం రూ .2.14 లక్షల కోట్లతో పోలిస్తే 13.42 శాతం పెరిగింది. మొత్తం రుణ లక్ష్యంలో వ్యవసాయ రంగానికి రూ.1,12,762 కోట్లు సహా ప్రాధాన్య రంగానికి రూ.1,85,326 కోట్లు కేటా యించారు.
తెలంగాణలో బలమైన పునాదికి బీజం పడిందిఆర్థిక వ్యవస్థ రాష్ట్ర సరి అయినా గాడిలో పడింది అనుకోవచ్చు రాష్ట్రము ఏర్పడిన అప్పటి నుండి, ప్రభుత్వం అభివృద్ధికి సమతుల్య విధానాన్ని నిర్వహించడం సరఫరా వైపు, అలాగే డిమాండ్‌ వైపు విధానాలను అమలు చేయడం ద్వారా. సరఫరా వైపు, ఇటువంటి కార్యక్రమాలు TS-iPASS, T-PRIDE, TS-IDEA, TS-GlobalLinker, మొదలైనవి, మెరుగుపరచడం ద్వారా వృద్ధి గుణకాలుగా పని చేశాయి.
ఉత్పాదకత, ఉత్పత్తి. డిమాండ్‌ వైపు, దళిత బంధు వంటి సంక్షేమ పథకాల శ్రేణి, రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ఆసరా పింఛన్లు, గొర్రెల పంపిణీ తదిత రాలు ఉన్నాయి. గృహాల కొనుగోలు శక్తిని పెంచడం, తద్వారా అందరి జీవన ప్రమాణాలు మెరుగుపడే దిశగా తెలంగాణ అడుగులేస్తోంది. సమాజంలోని అన్ని విభాగాలను స్పృచించుకుంటూ ముందుకు పరిగెడుతోంది.
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావం నుంచి నిలకడగా వృద్ధి చెందింద న్నారు. 2014-15 నుంచి 2022-23 మధ్య భారత నామ జీడీపీలో రాష్ట్ర వాటా 4.1 శాతం నుంచి 4.9 శాతా నికి పెరిగింది. 2022-23 తాత్కాలిక ముందస్తు అంచనాల ప్రకారం, ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) రూ .13.27 లక్షల కోట్లు – 2021 – 22 విలువతో పోలిస్తే 15.6% వృద్ధి చెందింది. దేశ జీడీపీ వృద్ధి రేటు 15.4 శాతంగా ఉంది. ఆర్థిక వ్యవస్థలో తెలసరి ఆదాయం భారత తలసరి ఆదాయాన్ని మించి పోయింది.
తెలంగాణ పీసీఐ (పేర క్యాపిట ఇండెక్స్‌) ప్రస్తుత ధరల ప్రకారం రూ.3.17 లక్షలు, ఇది జాతీయ పీసీఐ (రూ.1.71 లక్షలు) కంటే రూ.1.46 లక్షలు అధికం). ప్రభుత్వం కూడా వృద్ధిలో భాగస్వామ్యం ఉండేలా చూసు కుంది. ఎన్‌ఎఫ్హెచ్‌ఎస్‌ 2019-21 నివేదిక ప్రకారం, సమాన ఆదాయ పంపిణీ పరంగా అన్ని రాష్ట్రాలలో (తమిళనాడు, కేరళతో కలిపి) గణాంకాలతో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. అయితే తెలంగాణ అగ్రగామి అన్ని రంగాల్లో ఉన్న కొన్ని ప్రముఖమైనర్‌ విద్య ఉద్యోగ, చిన్న మద్య తరహా పరి శ్రమలు నెలకొల్పి ఉద్యో గాలు కల్పించడంలో విఫలమైం దని అనుభవజ్ఞుల మాట గ్రామీణ తెలంగాణ బలోపేత మౌతూనే రెవెన్యూ డివిజన్‌ లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే దుబాయ్‌ మష్కాట్‌ వలసలు తెగుతాయిని అంతే కాకుండా తెలంగాణకు ఆదాయ వనురులుగా ఉన్న మూత పడిన పరిశ్రమలని తిరిగి మళ్లీ ప్రారంభించాలని ప్రజల ఆకాంక్ష, పట్టభద్రులందరికి ఉద్యోగం కల్పిచటం తెలంగాణ లక్ష్యం అవ్వాలి.
డాక్టర్‌ కృష్ణ సామల్ల
ప్రొఫెసర్‌ & ఫ్రీ లాన్స్‌ జర్నలిస్ట్‌
9705890045

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News