చేవెళ్ల మండల కేంద్రంలో కాలం చెల్లిన నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. చేవెళ్ల సిఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం… శంషాబాద్ ఎస్ ఓ టి సిబ్భంది చేవెళ్ళ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గురు తులసి చేవెళ్ళ పోలీసులు సంయూక్తంగా రైడ్ చేసి షాబాద్ చౌరస్తాలో అట్ట పెట్టెలలో అమరచిన కొన్ని కాల పరిమితి దాటిన బీట్ రూట్ డబ్బాలతో ఉన్న వ్యక్తి పట్టుబడ్డాడు. ఈ కాలం చెల్లిన విత్తనాలను చుట్టుపక్కల గ్రామ రైతులను మభ్యపెట్టి మోసపూరితంగా అమ్ముతున్నాడన్న పక్కా సమాచారంతో చేవెళ్ళ పోలీసులు చేవెళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్ శంషాబాద్ ఎస్ ఓ టి సిబ్భంది సంయూక్తంగా షాబాద్ చౌరస్తాలో బస్ కోసం ఎదురుచూస్తున్న సయ్యద్ మొహమ్మద్ తాహేర్ తండ్రి సయ్యద్ ఓమర్ ను పట్టుకున్నారు. తాహెర్ వయసు 60 సంవత్సరాలు. వృత్తి వ్యాపారం చేస్తుంటారన్నారు. ఇమ్లి బన్ జమల్ మసీద్ యాకుత్ పురా హైదరాబాద్ ఉంటూ…ఈ నకిలీ విత్తనాల దందా సాగిస్తున్నాడన్నారు. ఇతని వద్ద కాలం చెల్లిన 250 గ్రాములు ఉన్న 52 బీట్ రూట్ విత్తనాల డబ్బాలు స్వాదినం చేసుకొన్నారు. ఈ విత్తనాల కాల పరిమితి తేదీలను తారు మారు చేసాన ఆనవాళ్లు గమనించి చేవెళ్ళ పోలీసు అతని పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తలించమన్నారు.
Spurious seeds: నకిలి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES