Saturday, November 23, 2024
HomeతెలంగాణPathikonda: విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ నకిలీ విత్తనాల అమ్మకాలు

Pathikonda: విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ నకిలీ విత్తనాల అమ్మకాలు

నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం మోపాల్సిన అధికారులే వత్తాసు

పత్తికొండ పట్టణ పరిధిలోని ఆదోని రోడ్ లో ఉన్న టీ బ్రేక్ క్యాంటీన్లో నకిలీ మిర్చి విత్తనాలు అమ్ముతుండగా కొంతమంది రైతులు వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చారు. వ్యవసాయ అధికారులు ఆగ మేఘాల మీద నకిలీ విత్తనాలు అమ్మే చోటుకి వచ్చి లేబుల్ లేని, గవర్నమెంట్ గుర్తింపు లేని విత్తనాలను ఎలా అమ్ముతారని అక్కడ వాదించి మీ మీద కేసులు కట్టాల్సి వస్తుందని చెప్పి బెదిరించారు. నకిలీ విత్తనాల వ్యాపారి వ్యవసాయ అధికారి నీ పక్కకు తోలుకొని మాట్లాడడంతో ఆ అధికారి కొనే రైతులు, అమ్మే వ్యాపారులు ఒక అగ్రిమెంట్ రాసుకుని అమ్ముకోవాలని సూచించడంతో సమాచార అందజేసిన రైతులు ముక్కున వేలేసుకున్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు పెట్టి కటకటాల వెనుకకు పంపాల్సిన అధికారులు ఉచిత సలహాలు ఇచ్చి పంపించడం చూసి అక్కడున్న రైతులు ఆశ్చర్యపోయారు. నకిలీ విత్తనాలు ఒక కారులో వేసుకుని వచ్చి అమ్ముతున్న వారిపై ఎందుకు కేసు కట్టలేదు అని ఆంధ్రప్రభ విలేఖరి అడగగా కొనే రైతు, అమ్మే వ్యాపారి ఇద్దరు అగ్రిమెంట్ చేసుకుని ఉన్నారని సమాధానం చెప్పారు వ్యవసాయ అధికారి, ఇప్పటికే నకిలీ విత్తనాలతో అరుకాలం పంట పండించి పండించిన పంట చేతికి రాక అప్పుల ఊబిలో పూరకపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వ్యవసాయ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని రైతులు వాపోతున్నారు.

- Advertisement -

వివరణ : – నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు అన్న సమాచారం రావడంతో అక్కడికి వెళ్లాం కానీ రైతు వ్యాపారి అగ్రిమెంట్ చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారని వారిని మేము ఏమి చేయలేము అని మాకు కనిపించిన నకిలీ విత్తనాల 10 ప్యాకెట్లు మా స్వాధీనంలోనే ఉన్నాయని వ్యవసాయ అధికారి వెంకట్రాముడు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News