అవినీతి రహిత పాలన ముఖ్యమంత్రి జగనన్నకే సాధ్యమని ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి తెలిపారు. చాగలమర్రిలోని 5వ వార్డులో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరించి లబ్ధి పొందిన వివరాల పత్రాలను అందజేశారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని విలేకరులతో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి జగనన్న సారథ్యంలో అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రజల నుండి ఒక రూపాయి కూడా తీసుకోకుండా పథకాలు నేరుగా అందిస్తున్నామని ఆయన తెలిపారు. తెలుగు దేశ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలను అడ్డుపెట్టుకొని ఆ పార్టీ నాయకులు ప్రజలను దోచుకున్నారని ఆయన విమర్శించారు. కేవలం టిడిపి వర్గీయులకే సంక్షేమ పథకాలు అందించారని ధ్వజమెత్తారు . ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్ , మండలా పార్టీ కన్వీనర్ కుమార్ రెడ్డి, మండల అధ్యక్షుడు వీరభద్రుడు , మండల ఉపాధ్యక్షుడు ముల్లా రఫీ, చాగలమర్రి ఉపసర్పంచ్ సోహెల్,మండల కో ఆప్షన్ సభ్యులు జీగ్గి ఇబ్రహీం, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ముల్లా జబ్బీర్,మండల ఎంపీటీసీ ఫయాజ్,లక్ష్మి రెడ్డి,జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు గణేష్ రెడ్డి, సర్పంచులు బంగారు షరీఫ్, గోవిందయ్య, ఎంపీడీవో మొహమ్మద్ దౌల, ఎంఈఓ అనురాధ, ఏఈలు ముల్లా షాజహాన్, కొండారెడ్డి, చాగలమర్రి ఈవో సుదర్శన్ రావు , సచివాలయాల సిబ్బంది, వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు గేట్ల మహబూబ్ సాబ్, ముల్లా ఖాదర్బాషా , ముల్లా చక్రం షబ్బీర్, వెంకటరమణ, , బాబు, అబ్దుల్లా, మదర్ వల్లి, మహబూబ్ సున్నా , ఆర్ఎస్ రమణ , ఐడియా బాబు, మెడికల్ స్టోర్ నాగేంద్ర, బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు , ప్రభు కాంత్ , స్వామి రెడ్డి, మండల ప్రచార కార్యదర్శి పెయింటర్ రఫీ పాల్గొన్నారు .
MLA Nani: అవినీతి రహిత పాలన జగనన్నకే సాధ్యం
ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తాం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES