పసుపల తాండ, భద్రి నాయక్ తాండ, కాలెనాయక్ తాండ, పెద్ద రాజు పాలెం గ్రామాల్లో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి నిర్వహించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పసుపుల గ్రామానికి చేరుకోగానే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూనే ప్రభుత్వ సంక్షేమ పథకాల పనితీరును ప్రజల నుంచే స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది.
అలాగే గ్రామంలోని ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ గ్రామ ప్రజలతోనే ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వయంగా తెలుసుకోవడమే కాకుండా ఆ ప్రధాన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను తూచా తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఇప్పటికే 98% మేరా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడం జరిగిందని చెప్పారు. అలాగే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు మరియు ప్రభుత్వ పనితీరు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా బనగానపల్లె నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకోవడమే కాకుండా ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఈ వైయస్సార్ ప్రభుత్వంలో అందడం జరుగుతుందని అదే గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల పేరుతో పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా కేవలం ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వారు టిడిపి కార్యకర్తలకు నాయకులకు మాత్రమే అందాయని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి పేదవానికి పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలంటే ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా మళ్లీ మనమంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అప్పుడే అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు తమ ఇంటి వద్దకే వస్తాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో బనగానపల్లె మండల అభివృద్ధి అధికారి శివరామయ్య, బనగానపల్లి మండల ఎంపీపీ మానసవీణ, బనగానపల్లె మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సన్నల జనార్దన్ రెడ్డి, పసుపల గ్రామ సర్పంచ్ మోహన్, ఎంపీటీసీ మహేశ్వరమ్మ,యాగంటి స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ తోట బుచ్చిరెడ్డి వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.