మహబూబ్ నగర్, కాటన్ మిల్ సమీపంలో పిల్లలమర్రి రోడ్ వద్ద రూ.28.57 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులను మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి వెంకటేశ్వర కాలనీకి చెందిన మహిళలు, కాలనీ పెద్దలు హాజరయ్యారు. స్థానికంగా ఉన్న తమ సమస్యలు మంత్రి ద్రుష్టికి తీసుకువచ్చారు. కాలనీలో ఉన్న పట్టణ ప్రకృతి వనం వద్ద స్థానిక మహిళలు గత కొన్ని రోజులుగా లైట్లు వెలగడం లేదని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ కు తెలిపారు. వెంటనే సంబంధిత సిబ్బందిని పిలిపించి రేపటి వరకు అక్కడ లైట్లు పడేలా చూడాలని మంత్రి ఆదేశించారు. సిబ్బంది ఫోన్ నెంబర్ ను స్థానిక మహిళలకు తెలిపి, పని అయ్యేవరకు వారికి ఫోన్ చేయాలని… అయినప్పటికీ వారు గనక స్పందించని పరిస్థితి వస్తే తన నెంబర్ కు కాల్ చేయాలని… వచ్చి దగ్గరుండి లైట్లు వేయించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్ రోజా తిరుమల వెంకటేష్, కమిషనర్ ప్రదీప్ కుమార్, నాయకులు రవి, బ్రహ్మం, వెంకటస్వామి, శేఖర్, సాయిలు, సత్యనారాయణ, వెంకటేష్, షాబుద్దీన్, భూపాల్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.