Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభBiggBoss 6 : ఈ సీజన్ బిగ్‌బాస్ విన్నర్‌కి ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా??

BiggBoss 6 : ఈ సీజన్ బిగ్‌బాస్ విన్నర్‌కి ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా??

- Advertisement -

BiggBoss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. 21 మందితో మొదలైన బిగ్‌బాస్ ఇప్పటికే 13
వారాలుగా ఒక్కొక్కరు 13 మంది ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌజ్ లో శ్రీహన్, రేవంత్, రోహిత్, శ్రీసత్య, కీర్తి, ఆదిరెడ్డి, ఇనయాలు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ ఏడుగురిలో ఫైనల్ కి వెళ్లే అయిదుగురు ఎవరో చూడాలి మరి.

అయితే బిగ్‌బాస్ విన్నర్ కి ఇచ్చే ప్రైజ్‌మనీ 50 లక్షలు అని షో మొదట్లోనే ప్రకటించారు. కానీ ఈ సారి కంటెస్టెంట్స్ రకరకాల టాస్కులు ఇచ్చి ఓడిపోతే విన్నర్ ప్రైజ్‌మనీ నుంచి అమౌంట్ తగ్గుతుందని, గెలిస్తే అమౌంట్ యాడ్ అవుతుందని చెప్పాడు బిగ్‌బాస్. దీంతో గత వారం రోజుల నుంచి బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులన్నీ చేశారు ఇంటిసభ్యులు.

కంటెస్టెంట్స్ చేసిన టాస్కులతో యాడ్ అయ్యేవి, తీసేవి మొత్తం లెక్కలేసుకొని ప్రైజ్‌మనీ చివరకి 47 లక్షలు మిగిలింది. దీంతో బిగ్‌బాస్ ఇవ్వాలనుకున్న ప్రైజ్‌మనీలోంచి 3 లక్షలు తగ్గింది. ఇక ఈ 47 లక్షలతో పాటు 25 లక్షలు విలువ చేసే ల్యాండ్ ని కూడా విన్నర్ గెలుచుకోనున్నారు. మరి ఆ అదృష్టవంతుడు ఎవరో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News