Saturday, November 23, 2024
HomeతెలంగాణKale Yadayya: "మంచినీళ్ల పండుగ"లో ఎమ్మెల్యే

Kale Yadayya: “మంచినీళ్ల పండుగ”లో ఎమ్మెల్యే

అమెరికాను మైమరిపించే రీతిలో హైదరాబాద్ మహా నగరంలో స్కై వేలు ఫ్లైఓవర్లు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలల్లో భాగంగా చేవెళ్ళ గ్రామ పంచాయతీ ఆవరణలో “మంచినీటి పండుగ” జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరయ్యారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నాడు మంచినీటి కోసం పల్లె ప్రజలు పరిగడుపున పడిగాపులు కాషారని! నేడు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ చల్లని నీళ్లతో పల్లె జనం గొంతు తడుస్తుందన్నారు. నా మోటగిరికల బోరు బావుల నీళ్లు తోడి బొబ్బలు వచ్చేయన్నారు. వేసవి వచ్చిందంటే మంచినీళ్ల కోసం ప్రభుత్వం లక్షలు వెచ్చించి బోర్లు వేసిన చుక్కనీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. మిషన్ భగీరథ అంకురార్పణ అనంతరం పల్లె ప్రజల కష్టాలు తీరాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మిషన్ భగీరథ మానస పుత్రిక అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో కెసిఆర్ సీఎం కాకముందే మంచినీరు అందించారన్నారు. మిషన్ భగీరథ నీరు కృష్ణ నది మహాబలేశ్వరం శ్రీశైలం అంతర్గంగ నుండి తన్నుకొస్తున్న నీరు అన్నారు. ఈ నీటిని సెక్రటేరియట్ సీఎం క్యాంపు కార్యాలయాల్లో కూడా త్రాగుతున్నారన్నారు. అమెరికాను మైమరిపించే రీతిలో హైదరాబాద్ మహా నగరంలో స్కై వేలు ఫ్లైఓవర్లు నిర్మించారన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి “హర్ గర్ కు స్వచ్ఛ జల్ ” ప్రవేశ పెడుతుందన్నారు.

- Advertisement -

రైతు బీమా పథకం ద్వారా చనిపోయిన రైతు దినవారం కాక ముందే భీమ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మల్గారి విజయలక్ష్మి వెంకటేశ్వర రెడ్డి జడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి స్థానిక సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి చేవెళ్ల వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్ మండల బిఎస్ ఎస్ అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్ ఎంపీటీసీ గుండాల రాములు మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు బక్కరెడ్డి రవీందర్ రెడ్డి రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నాగార్జున రెడ్డి అల్లవాడ సర్పంచ్ భీమ్ రెడ్డి ఎంపిటిసి సత్యనారాయణ చారి పామేన సర్పంచ్ అక్నాపూర్ మల్లారెడ్డి అంతారం సర్పంచ్ సులోచన అంజయ్య గౌడ్ దేవరంపల్లి సర్పంచ్ నరహరి రెడ్డి ఆలూరు సర్పంచ్ విజయలక్ష్మి నరసింహులు చేవెళ్ళ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు గుడిపల్లి రవికాంత్ రెడ్డి బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు తోట చంద్రశేఖర్ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ గౌడ్ బిఆర్ఎస్ వి నియోజకవర్గ అధ్యక్షులు అత్తేలి రాఘవేందర్ రెడ్డి చేవెళ్ల పట్టణ అధ్యక్షుడు జుకన్నగారి జైపాల్ రెడ్డి మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ గని మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఫయాజుద్దీన్ మహేష్ వెంకటేష్ ప్రభుత్వ అధికారులు దశాబ్ది ఉత్సవాల నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆర్ డి ఓ వేణుమాధవరావు తాసిల్దార్ శ్రీనివాసులు ఎంపీడీవో రాజ్ కుమార్ ఎంపీఓ విఠలేశ్వర్ జి వ్యవసాయ అధికారి తులసి మిషన్ భగీరథ ఏఈ గీత ఉప తాసిల్దార్ రాజశేఖర్ ఆర్ ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News