తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేడుకల లో భాగంగా KPHB కమ్యూనిటీ హాల్ లో జరిగిన మంచి నీళ్ళ పండుగ కార్యక్రమం లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 9 ఏళ్ల కాలంలో 90 ఏళ్ల గా పరిష్కారం కానీ పనులు పూర్తి చేశారని…ఒకప్పుడు ఎగతాళి చేసిన వారే ముక్కున వేలు వేసుకునెట్టట్టు చేసిన గొప్ప నాయకుడు కెసిఆర్ అని అన్నారు….మిషన్ భగీరథ ద్వారా ఇంటి ఇంటికి మంచినీరు ఇస్తా అన్న మాట ప్రకారం నేడు తెలంగాణ రాష్ట్రంనీ ఆదర్శ రాష్ట్రంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అవలంభిస్తోందని గుర్తుచేశారు…కూకట్పల్లి నియోజకర్గంలో అన్ని డివిజన్ లలో నీటి ఎద్దడి లేకుండా…ఎక్కడికక్కడ లక్షల గ్యాలన్ ల నీటి ట్యాంక్ లు నిర్మించామని అన్నారు…270 కిలో మీటర్ ల నుండి కాళేశ్వరం నీరు మహా నగరానికి తీసుకు వచ్చి ప్రజల గొంతు గడుపుతున్న కలియుగ భగీరథుడు మన ముఖ్యమంత్రి కెసిఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు…ఇంత కష్టపడి నీటిని తీసుకు రావడానికి 1 లీటరుకు 60 రూపాయలు ఖర్చు అవుతుంది అని…ప్రతి ఒకరు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.
అలాగే నీటి విభాగం అధికారులు కూడా ఎంతో కృషి చేస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చిన పరిష్కరించి ముందుకు వెళుతున్నారని … దీనికి ప్రధాన అధికారి అయిన దాన కిషోర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు… ఒకప్పుడు మహిళలు బిందులు పట్టుకుని నీటి కోసం నానా ఇబ్బందులు పడే వారని ..నేడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని.. జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు.. ఎంతోమంది మంత్రులు ..ముఖ్యమంత్రులుగా చేసిన పరిష్కారం కానీ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య నేడు ఎందుకు పరిష్కారం అయిందో ఆలోచించుకోవాలని ప్రజలకు తెలిపారు.. భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు..ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను సత్కరించారు… ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందాడి శ్రీనివాసరావు… పగడాల శిరీష బాబురావు.. సబియా గౌసుద్ది న్.. జూపల్లి సత్యనారాయణ… ఆవుల రవీందర్ రెడ్డి… మాజీ కార్పొరేటర్లు తూము శ్రవణ్ కుమార్ బాబురావు.. డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి ..ప్రభాకర్ గౌడ్.. సంతోష్.. నీటి విభాగమాధికారులు పాల్గొన్నారు.