Friday, April 4, 2025
HomeతెలంగాణBandi Sanjay Kumar: ప‌్ర‌జా సంగ్రామ యాత్ర‌లో రైతు కోరిక తీర్చిన సంజ‌య్‌..

Bandi Sanjay Kumar: ప‌్ర‌జా సంగ్రామ యాత్ర‌లో రైతు కోరిక తీర్చిన సంజ‌య్‌..

Bandi Sanjay Kumar: జ‌గిత్యాల జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండిసంజ‌య్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ సంజ‌య్ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేఖ విధానాల‌ను అవ‌లంభిస్తుంద‌ని, ప్ర‌జా రంజ‌క పాల‌న రావాలంటే బీజేపీతోనే సాధ్య‌మ‌ని సంజ‌య్ ప్ర‌జ‌ల‌కు సూచిస్తూ ముందుకు సాగుతున్నారు. జ‌గిత్యాల జిల్లా కోరుట్ల నియోజ‌క‌వ‌ర్గం ఐలాపురం గ్రామం స‌మీపంలో బండి సంజ‌య్ పాద‌యాత్ర సాగింది. ఈ క్ర‌మంలో ఓ రైతు కోరిక మేరకు ట్రాక్టర్ నడిపి, బండి సంజ‌య్ పొలంలో ద‌మ్ము చేశాడు.

- Advertisement -

ఐలాపూర్ గ్రామ సమీపంలోకి బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ పాదయాత్ర చేరుకోగా.. ఓ రైతు బండి సంజయ్ వద్దకువెళ్లారు. త‌న పొలంలో ట్రాక్ట‌ర్ తో ద‌మ్ముచేయాల్సిందిగా కోరాడు. రైతు కోరిక మేర‌కు సంజ‌య్ పాద‌యాత్ర మ‌ధ్య‌లోనే రైతు పొలంలోకి వెళ్లారు. ట్రాక్ట‌ర్‌పైకి ఎక్కి కాసేపు పొలంలో ద‌మ్ముచేశాడు. కొద్దిసేప‌టి త‌రువాత తిరిగి పాద‌యాత్ర‌ను పాదయాత్రగా బండి సంజ‌య్ ముందుకు సాగాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News