టాలీవుడ్ చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆదివారం కన్నుమూశారు. రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ‘ఆట’, ‘ఢీ’ వంటి డ్యాన్స్ రియాల్టీ షోల ద్వారా
సినీ కెరీర్ ప్రారంభించారు. ఆలా వచ్చిన ఫేమ్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొరియోగ్రాఫర్‌గా సక్సెస్ అయ్యారు. 1500లకు పైగా సినిమాలకు పనిచేశారు. అయితే ఆయన శైలినే ఆయన్ను అవకాశాలు లేకుండా చేసిందని అంత అంటుంటారు.
సినిమా ఛాన్సులు లేకపోవడం తో గడిచిన రెండుమూడేళ్లుగా యూట్యూబ్ స్టార్‌గా ఎదిగారు. పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎవ్వరికీ భయపడకుండా ఆయన చేసే వ్యాఖ్యలకు చాలా మంది అభిమానులున్నారు. ఆలా యూట్యూబ్ తో బాగా ఫేమస్ అయినా రాకేష్..అగ్గిపెట్టె మచ్చ, సునిశిత్ ,స్వాతి నాయుడు తదితరులతో పలు ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాడు.
వారం రోజుల క్రితం వైజాగ్ షూటింగ్ కు వెళ్లారు. అక్కడ విపరీతమైన మద్యం సేవించినట్లు తెలుస్తుంది. దీంతో ఆయనకు రక్త విరోచనాలు అయ్యాయని , రక్త విరోచనాలు ఎక్కువ కావడం తో ఆయన్ను గాంధీ హాస్పటల్ లో చేర్పించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆదివారం కన్నుమూశారు.
రాకేష్ మాస్టర్ మృతిపై ఆయన అసిస్టెంట్ సాజిద్ స్పందించారు. రాకేష్ మాస్టర్ బతకడం కష్టమని రెండు నెలల క్రితమే డాక్టర్లు చెప్పారని సాజిద్ వెల్లడించారు. తాను రాకేష్ మాస్టర్‌కు ఎడిటర్‌గా పనిచేశానని.. తనపై నమ్మకంతో ప్రతి విషయానికి తననే పిలుస్తారని సాజిద్ చెప్పారు. ‘హనుమాన్’ సినిమా క్లైమాక్స్ షూటింగ్లో పాల్గొన్న రాకేష్ మాస్టర్.. ఆ సమయంలోనే రక్తపు విరోచనాలు, వాంతులు చేసుకున్నారని సాజిద్ వెల్లడించారు. అప్పుడు తానే హాస్పిటల్‌కు తీసుకెళ్లానని.. పరీక్షలు చేసిన వైద్యులు బతకడం కష్టమని, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారని తెలిపారు. ‘డాక్టర్లు చెప్పిన తరవాత రాకేష్ మాస్టర్ నెలన్నరపాటు మద్యం సేవించడం ఆపేశారు. ఆ తరవాత కొంతమంది ఆయనపై అభిమానంతో మద్యం తాగించారు. దీంతో ఆయన మళ్లీ మొదలుపెట్టినట్లు సాజిద్ చెప్పుకొచ్చారు.