Free Condoms : సాధారణంగా ప్రభుత్వాలు ప్రజలకు నిత్యావసర వస్తువులైన ఉప్పులు, పప్పులు, బియ్యం, కూరగాయలు వంటివి ఉచితంగా అందిస్తుంటాయి. అయితే.. ఇక్కడో ప్రభుత్వం మాత్రం కండోమ్స్‌ను ఫ్రీగా ఇస్తామని అంటోంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినప్పటికి నూతన సంవత్సరం(1జనవరి 2023) నుంచి ఆదేశంలోని యువతకు కండోమ్‌లను ఫ్రీగా అందిచనున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఫార్మసీ షాపుల్లో ఉచితంగా కండోమ్స్ ఇవ్వాల్సిందేనని ఇప్పటికే ఆదేశాలు సైతం జారీ చేశారు.
అయితే.. ఇది మన దగ్గర కాదులెండి. ఫ్రాన్స్ దేశంలో. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న యువతీయువకులకు కండోమ్స్‌ను ఉచితంగా ఇస్తామని చెప్పారు. అయితే.. వీరు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా ఓ కారణం ఉంది.
ప్రాన్స్ దేశంలో 2020-21లో లైంగికంగా సంక్రమించే వ్యాధుల రేటు 30 శాతం పెరిగింది. యువత ఎక్కువగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం కారణంగా అవాంఛిత గర్భదారణల సంఖ్య పెరుగుతోంది. దీంతో యువత ఎక్కువగా జనన నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటున్నారట. ఈ నేపథ్యంలో అవాంఛిత గర్భాన్ని, లైంగిక వ్యాధులను నిరోధించేందుకు, వాటి నుంచి యువతను రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఈ నిర్ణయం జనవరి 1, 2023 నుంచి అమల్లోకి రానుంది. ఫ్రాన్స్ అధ్యక్షడు తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లైంగికంగా సంక్రమించే రోగాలను పూర్తిస్థాయిలో నిరోధించే అవకాశం లభిస్తుందని బావిస్తున్నారు.ఫ్రాన్స్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.