తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంబరాల్లో భాగంగా హరితోత్సవం మొక్కలు నాటే కార్యక్రమం తార్నాక డివిజన్లోని నాగార్జున నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటైన పార్కు ప్రాంగణంలో బి.ఆర్.ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డితో కలిసి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి మొక్కలు నాటారు, ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణకు హరితహారం పథకాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు, పచ్చదనానికి పునర్జీవం పోసి అడవులకు పూర్వవైభవం తెచ్చి అడవులు తగ్గడం తప్ప పెరగడం తెలియని భారత దేశంలో పచ్చదనాన్ని అడవులను పెంచి చూపిన ఘనత మన కేసీఆర్ది, హరితహారం ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణలో 7.70 % పచ్చదనం పెరిగిందని వెల్లడించారు, మన ప్రియతమ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి పరిధిలో అనేక హరితహారం కార్యక్రమాలను నూతన పార్కులను ఏర్పాటు చేశారు. నాగార్జున నగర్ పార్క్ అభివృద్ధికి జిహెచ్ఎంసి తరపున అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ హేమలత, ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఇంజనీర్ సువర్ణ, శానిటేషన్ సూపర్వైజర్ ధనా గౌడ్, ఆర్టికల్చర్, శానిటేషన్, ఎంటమాలజీ విభాగ అధికారులు మరియు బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.