తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు వివిధ విభాగాల చెందిన అధికారులతో కలిసి మొక్కలను నాటారు. శాస్త్రీయ పద్ధతిలో మొక్కలు నాటిన తర్వాత నీళ్లు పోశారు. హరితోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకుని కమిషనరేట్ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు కార్యాలయాల ఆవరణలో మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతి పౌరుడు మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కల పరిరక్షణకు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పారు. కమిషనరేట్ వ్యాప్తంగా విడతల వారీగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని కొనసాగించనున్నామని తెలిపారు
ఈ కార్యక్రమంలో డిసిపి (శాంతి భద్రతలు) ఎస్ శ్రీనివాస్, అడిషనల్ డిసిపి (సిఏఆర్) ఎం భీం రావు, ఏసిపి లు సి ప్రతాప్, పి కాశయ్య, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు, సృజన్ రెడ్డి ఆర్ఐలు శేఖర్ బాబు, సురేష్, మురళి తదితరులు పాల్గొన్నారు.