Thursday, September 19, 2024
HomeతెలంగాణJammikunta: రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు

Jammikunta: రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు

రాహుల్ పుట్టినరోజు మిఠాయిలు, పండ్లు పంపిణీ

జమ్మికుంట గాంధీ చౌరస్తాలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడెపు సారంగపాణి ఆధ్వర్యంలో ఏఐసీసీ, నాయకులు రాహుల్ గాంధీ 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి చిరు వ్యాపారస్తులకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ రాహుల్ గాంధీ జోడో పాదయాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో మళ్లీ కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. జోడో యాత్రలో ప్రతి కార్యకర్తను చైతన్యవంతం చేసి ప్రతి కుటుంబానికి కలుస్తూ ప్రేమ అనురాగాలతో ఆప్యాయంగా మాట్లాడి భరోసాను కల్పించిన రాహుల్ గాంధీ నాయకత్వంలో రానున్న రోజుల్లో ఇటు రాష్ట్రంలో అటు దేశంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళ అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు, మానుపాటి సూర్య, మాజీ మార్కెట్ డైరెక్టర్లు సుంకరి రమేష్, ఎండి సలీం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దమల్ల రవి, చంచల శ్రీనివాస్, అయోధ్య గౌడ్, రాచపల్లి మల్లేష్, పొన్నం చంద్రమౌళి గౌడ్, సైదాబాద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News