హొళగుంద నుండి ధనాపురం రోడ్డు మోకాలిలోతు గుంతలు ఏర్పడి, కంకర రాళ్లు తేలి ప్రయాణం చేయడానికి నరకయాతన తలపిస్తుండడంతో బస్సులు తిరగడానికి అనుకూలంగా లేదని బస్సులే ఆపివేయడంతో, టెండర్ పట్టుకున్న కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో స్పందించిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తన సొంత నిధులతో ప్రజలకు, విద్యార్థులకు ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మత్తుల చేపడుతున్నారు. గుంతలు ఏర్పడిన రోడ్డును చదును చేస్తూ గ్రావెల్ వేస్తూ బస్సులు తిరగడానికి అనుకూలంగా మరమ్మత్తులు చేపడుతున్నారు.
హొళగుందలోని ఆదోని రోడ్డుకు మంత్రి సోదరులు దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు మరియు వైసీపీ ఆలూరు తాలూకా ఇన్చార్జి గుమ్మనూరు నారాయణస్వామి సోమవారం పూజ చేసి రోడ్డు మరమ్మత్తులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బావ కోగిలతోట కురువ శేషప్ప,సొసైటీ సింగిల్ విండో చైర్మన్ మల్లికార్జున, ఎంపీపీ తనయుడు ఈసా,ఎంపీటీసీ మల్లికార్జున, సర్పంచ్ తనయుడు పంపాపతి, వైసీపీ సీనియర్ నాయకుడు రామకృష్ణ, ఎంపీటీసీ షేక్షావలి, కో ఆప్షన్ మెంబర్ సాయిబేస్, తోక వెంకటేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.