Sunday, October 6, 2024
Homeనేషనల్Sania Mirza: సానియా–షోయబ్ నిజంగా విడిపోయారా? షోయబ్ ఏం చెప్పాడంటే

Sania Mirza: సానియా–షోయబ్ నిజంగా విడిపోయారా? షోయబ్ ఏం చెప్పాడంటే

Sania Mirza: భారత టెన్నిస్ మాజీ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా–షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతకాలం ఈ అంశంపై అటు సానియా.. ఇటు షోయబ్ స్పందించింది లేదు. కానీ, తాజాగా ఈ అంశంపై షోయబ్ మాలిక్‌ మాట్లాడాడు. ఒక కార్యక్రమానికి హాజరైన షోయబ్ మాలిక్‌ను మీడియా దీని గురించి ప్రశ్నించింది.

- Advertisement -

ఈ అంశంపై షోయబ్ మాట్లాడుతూ ‘‘ఇది మా వ్యక్తిగత విషయం. ఇప్పటివరకు నేను కానీ, నా భార్య సానియా మీర్జా కానీ దీనిపై స్పందించింది లేదు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి” అని వ్యాఖ్యానించాడు. షోయబ్ సమాధానంతో విడాకుల విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. దీంతో మరికొంత కాలం ఈ విషయంపై సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే, సానియా–షోయబ్ విడిపోయారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంలో నిజం లేదని అనేకసార్లు రుజువైంది. కానీ, ఇటీవలి కాలంలో ఈ ప్రచారం ఎక్కువైంది. పైగా సానియా తన సోషల్ మీడియా ఖాతాలో చేస్తున్న పోస్టులు తన విడాకుల విషయంలో అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. అలాగే సానియా సోషల్ మీడియాలో తన భర్త ఫొటో లేకుండానే చాలా ఫొటోల్ని షేర్ చేస్తోంది. అలాగే సానియా సన్నిహితులు కొందరు మాత్రం దీనిపై అనధికారికంగా మాట్లాడారు. వాళ్లిద్దరూ ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, ఎప్పటి నుంచో విడిగా ఉంటున్నారని చెప్పారు. కాగా, సానియా మీర్జా–పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్లు దుబాయ్‌లో ఉంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News