Sunday, November 24, 2024
Homeఓపన్ పేజ్Change in America's attitude: అమెరికా పంథాలో గణనీయ మార్పు

Change in America’s attitude: అమెరికా పంథాలో గణనీయ మార్పు

చైనాకు చెక్ పెట్టేందుకే మళ్లీ యునెస్కోలోకి 'పెద్దన్నయ్య'

ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ యునెస్కోలో తాను తిరిగి ప్రవేశిస్తున్నట్టు అమెరికా ఇ టీవల ప్రకటించింది. 2011లో బారక్‌ ఒబామా ప్రభుత్వం ఈ సంస్థకు నిధులు ఇచ్చే సంప్రదాయానికి స్వ స్తి చెప్పగా, 2017లో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఈ సంస్థ నుంచి వైదొలగడం జరిగింది. అమెరికా మళ్లీ ఈ సంస్థలో చేరడానికి ప్రధాన కారణం చైనా అనే విషయం ప్రపంచ దేశాలకు పూర్తిగా అర్థమైపోయింది. ఈ సంస్థ నుంచి అమెరికా నిష్క్రమించిన తర్వాత ఇందులో చైనా ప్రాభవం, వైభవం గణనీయంగా పెరగడం ప్రారంభం అయింది. కృత్రిమ మేధ, సాంకేతిక పరిజ్ఞాన సంబంధమైన ఆవిష్కరణల మీద చైనా అజ మాయిషీ చేయడం ఎక్కువైంది. సహజంగానే ఇది అమెరికాకు కంటగింపయింది. చైనా కారణంగా అమెరికా ఈ బహుళ జాతీయ సంస్థ నుంచి నిష్క్రమించడం జరగలేదు కానీ, చైనా కారణంగా మాత్రం ఇందులో పున:ప్రవేశానికి సందర్భం ఏర్పడింది. 2020లో కోవిడ్ మహమ్మారి విజృంభించిన కాలంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ సంస్థ నుంచి వైదొలగడం జరిగింది. ఈ సంస్థ నుంచే కాక ఆ తర్వాత ఆయన పారిస్‌ ఒప్పందం నుంచి కూడా నిష్క్రమించారు. ఈ సంస్థలలో చైనా, భారత్లకు ఉన్నంత ప్రాధాన్యం తమకు ఉండడం. లేదని, ఈ రెండు దేశాల కోసం తాము వీటికి నిధులు ఇస్తున్నట్టు కనిపిస్తోందని ఆయన అప్పట్లో వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా ఆయన ప్రభుత్వం నిధులు ఇవ్వడాన్ని ఉప సంహరించుకుంది. కోవి్‌డ మహమ్మారి వ్యాపించడానికి చైనా కారణం అయినప్పటికీ, ప్రపంచ ఆరోగ్య సం స్థ ఆ దేశం విషయంలో ఒక్క చర్య కూడా తీసుకోలేదని ట్రంప్‌ ఇందుకు కారణం చెప్పారు.
జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా పంథాలో మళ్లీ మా ర్పు వచ్చింది. అమెరికా మళ్లీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు ఇవ్వడం ప్రారంభించింది. ఐక్యరాజ్య సమి తికి చెందిన అన్ని సంస్థలోనూ మళ్లీ కాలు పెట్టడం జరిగింది. నాలుగైదు రోజుల క్రితం యునెస్కోలో పునః ప్రవేశం చేయడమే కాకుండా, ఈ సంస్థ ప్రాధాన్యాన్ని అనేక విధాలుగా ప్రశంసించింది. చివరికి వాతావర ణం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పారిస్‌ ఒప్పందంలో కూడా చేరింది. నిజానికి, ఈ సంస్థల నుంచి అమెరికా నిష్క్రమించడానికి సరైన కారణాలు కనిపించవు. ఇజ్రాయెల్‌ దేశానికి ఆ సంస్థలో సరైన స్థానం ఉండడం లేదని భావించిన అమెరికా తన మిత్ర దేశం కోసం వాటి నుంచి నిష్క్రమించిందనే అభి ప్రాయం అప్పట్లో అనేక దేశాల నుంచి వ్యక్తం అయింది. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు చోటు చేసుకోనప్పటికీ, ఈ సంస్థలో అమెరికా మళ్లీ చేరడం విచిత్రంగానే కనిపిస్తోంది. చైనా పట్ల అమెరి కా మనసులో ఉన్న ఒక విధమైన అనుమానం, భయం ఇందుకు కారణం కావచ్చు. ఏ సమస్యకైనా అమెరి కా దేశానికి చైనా బూచీయే కారణంగా కనిపిస్తూ ఉంటుంది. మొదటిసారిగా, 1984లో అప్పటి రోనాల్డ్‌ రీ గన్‌ పభుత్వం యునెస్కోకు గుడై చెప్పింది. ఈ సంస్థను అడ్డం పెట్టుకుని సోవియట్‌ యూనియన్‌ తన ప్రయోజనాలను పెంచుకుంటోందని రీగన్‌ అప్పట్లో వ్యాఖ్యానించడం జరిగింది.
నిజానికి, కృత్రిమ మేధ రంగంలో చోటు చేసుకుంటున్న ఆవిష్కరణలకు, సామాజిక, సాంస్కృతిక పరిణా మాలకు ఏమాత్రం సంబంధం లేదు. ఇక్కడ చారిత్రాత్మక సాంకేతిక పరిజ్ఞాన మార్పులకు కూడా ఎక్కడా సంబంధం లేదు. కృత్రిమ మేధ, టెక్నాలజీ రంగాలలో వస్తున్న మార్పులు, చేర్పుల విషయంలో అమెరికా అన్ని రకాల ఉత్పత్తులకు పేటెంట్‌ హక్కులను పొంది ఉంది. ఏ విధంగా చూసినప్పటికీ ఈ రంగాలలో అ ది ఇతర దేశాల కంటే ఎంతో పురోగతి సాధించింది. ఇందుకు భిన్నమైన అంశాలు, రంగాలలో మాత్రమే చైనా ముందంజలో ఉంది. చైనా అధిక జనాభాను కలిగి ఉండడం వల్ల మార్కెటింగ్కు అమెరికా కంటే ఎ న్నో అవకాశాలున్నాయి. వాటితో యునెస్కోకు ఎటువంటి సంబంధమూ లేదు. అంతేకాదు, కృత్రిమ మేధ, టెక్నాలజీ వంటి రంగాలలో ఏ దేశం కూడా ఎల్లకాలం ముందుండడం సాధ్యం కాదు. యునెస్కోలో చేరే వ బందు అమెరికా 600 మిలియన్‌ డాలర్ల బకాయీలను చెల్లించడం ఆ సంస్థను ఆర్థికంగా ఒడ్డున పడేసే అ వకాశం ఉన్నప్పటికీ, ఈ దేశం తన తీరుతెన్నులను మార్చుకోవాల్సిన అవసరం మాత్రం కనిపిస్తోంది. ప్రవే శం, నిష్క్రమణం వంటి విషయాల్లో యునెస్కో వంటి ఐక్యరాజ్య సమితి సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు కొన్ని కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం అతి చి న్న కారణాల మీద ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం సబబుగా కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News