Saturday, November 23, 2024
HomeతెలంగాణKorukanti Chander: తెలంగాణ రాష్ట్ర హ్యట్రిక్ సిఎంగా కేసీఆర్‌

Korukanti Chander: తెలంగాణ రాష్ట్ర హ్యట్రిక్ సిఎంగా కేసీఆర్‌

సింగరేణి గని కార్మికులు బార్డర్లో సైనికులతో సమానం

అనాటి ప్రభుత్వాలు కార్మిక సంఘలు పోగోట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి కారుణ్య నియమాకాల ద్వారా సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దే అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాలు, రామగుండం దశాబ్ది ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆర్జీ వన్ ఏరియా సివిల్ డిపార్ట్‌మెంట్ లో ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఆమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ సింగరేణి గని కార్మికులంటే సిఎం కేసీఆర్‌ కు అమితమైన అభిమానమని… సింగరేణి కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్న సిఎం కేసీఆర్‌ కార్మికులకు కొండంతా అండగా నిలుస్తున్నరని అన్నారు. రక్తాన్ని చెమటగా మార్చి తమ జీవితాలను పణంగా పెట్టి వెలుగులు అందిస్తున్న సింగరేణి గని కార్మికులు బార్డర్లో సైనికులతో సమానం అన్న‍ారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో 14 ఏళ్ల పాటు అలుపెరుగని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సాగించి పట్టువదలనీ విక్రమార్కుడి వలే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. 2001 సంవత్సరం ప్రోపెసర్ జయశంకర్ సార్ రాసిన తల్లడిల్లుతున్న తెలంగాణ పుస్తకం చదివి తాము ఉద్యమ ప్రస్దానం ప్రారంభించామని చెప్పారు. 14 ఏళ్లపాటు స్వరాష్ట సాధన కోసం అలుపెరగని పోరాటం సాగించామని వందలాది కేసులు పెట్టిన రాష్ట్ర కోసం పోరాటం సాగించామని గుర్తు చేసారు. తెలంగాణ ఉద్యమంలో గని కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవతరణ అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గనిర్దేశంలో సింగరేణి సంస్థ లాభాల్లో గొప్పగా సాధించిందని అన్నారు. గత సంవత్సరం ఫిల్టర్ బెడ్ లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో సివిల్ కార్మికులు వరదల చిక్కుకున్న సందర్భంలో రెస్యూ సిబ్బందితో కలసి కార్మికన్నాల ప్రాణాలే ముఖ్యంగా భావించి తమ ప్రాణాలను సైతం లెక్క చెయకుండా వారిని కపాడామన్నారు. సింగరేణి కార్మికన్నాలంటే తమకు అమితమైన అభిమానమని వారి కోసమే ఎంత దూరమైన తాము వేళ్తామన్నారు.

- Advertisement -


తెలంగాణ రాష్ట్రంలో సకలజనులందరికి సిఎం కేసీఆర్‌ పై వారి పాలనపై పూర్తి విశ్వాసం ఉందని 2024లో తెలంగాణ రాష్ట్రానికి సిఎం కేసీఆర్‌ హ్యట్రిక్ సిఎం కావడం ఖాయమన్నారు. అనంతరం ఇతర యూనియన్ లకు చెందిన పుల్లూరి సాగర్,లక్ష్మయ్య, మహర్షి,రవి ఎమ్మెల్యే గారి సమక్షంలో టి.బి.జి.కె.ఎస్ యూనియన్ లో చెరాగా వారిని ఎమ్మెల్యే యూనియన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కెంగర్ల మల్లయ్య, దామోదర్, దాసరి శ్రీనివాస్, చెంద్రయ్య, వెంకటేష్, వడ్డేపల్లి శంకర్, శేషగిరి, మండ రమేష్, పుట్ట రమేష్ గండు శ్రావన్ మల్లారెడ్డి, మాదాసు రామమూర్తి, మారుతి, గుంపుల ఓదేలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News