Saturday, November 23, 2024
HomeతెలంగాణSrinivas Goud: యునెస్కో గుర్తింపు అర్హతున్న హెరిటేజ్ సైట్ లు చాలా ఉన్నాయి

Srinivas Goud: యునెస్కో గుర్తింపు అర్హతున్న హెరిటేజ్ సైట్ లు చాలా ఉన్నాయి

ముదుమాల్ లో ఉన్న పురాతన చారిత్రక గుర్తింపు ఉన్న అంతరిక్ష, వాతావరణ మార్పుల కేంద్రంకు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల గుర్తింపు జాబితాకు పంపేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్ పరిరక్షణ సాంకేతిక సహకారంపై తెలంగాణ హెరిటేజ్ శాఖ దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టుల మధ్య అవగాహన ఒప్పంద పత్రాలను అందజేశారు రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.

- Advertisement -

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పురాతన చరిత్ర, కట్టడాలు, చారిత్రక వారసత్వ సంపద ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కృషి వల్ల రామప్ప దేవాలయంకు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చారిత్రక, పురాతన చరిత్ర, చారిత్రక వారసత్వ సంపదగా యూనెస్కో గుర్తింపు పొందడానికి ఎన్నో కట్టడాలు ఉన్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న చారిత్రక పురావస్తు కట్టడాలపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారు. యునెస్కో గుర్తింపు కోసం నారాయణ పేటలో ఉన్న ముడుమాల్ పురావస్తు కేంద్రం ఆదిమ మానవుని కాలం నుండి అంతరిక్ష పరిశోధన, వాతావరణ మార్పులను తెలుసుకోవడానికి ఈ చారిత్రక కేంద్రంకు ఎంతో పేరు ఉందని చరిత్ర పరిశోధకులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చరిత్ర, వారసత్వ సంపద, కట్టడాలు చరిత్రా వెలికితీయడానికి, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల గుర్తింపు కోసం విశేష కృషి చేస్తున్నామన్నారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కోసం అవసరమైన డాక్యుమెంటేషన్ పరిరక్షణకు, సాంకేతిక సహాయం అందించేందుకు తెలంగాణ హెరిటేజ్ శాఖ – దక్కన్ హెరిటేజ్ అకాడమి ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్ ల మధ్య MOU చేసుకున్నారు. ఈ సంధర్బంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఒప్పింద పత్రాలను డక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టు ప్రతినిధులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ హెరిటేజ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్, హెరిటేజ్ అకాడమీ ట్రస్టు ప్రతినిధులు కట్ట ప్రభాకర్ ప్రొఫెసర్ K P రావు లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News