Tuesday, September 24, 2024
HomeతెలంగాణSingareni: సింగరేణిలో తక్షణం ఎన్నికలు నిర్వహించాలి

Singareni: సింగరేణిలో తక్షణం ఎన్నికలు నిర్వహించాలి

2019లోనే కాలపరిమితి ముగిసింది

రామగుండం ఏరియలోని 11వ గనిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ జెబిసిసిఐ సభ్యులు కొత్త కాపు లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడారు.. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు 2017 సంవత్సరంలో నిర్వహించి 2019 వరకు కాలపరిమితి ముగిసిన రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో ఎన్నికలు నిర్వహించకుండా అనేక ఆంక్షలు ఆక్షేపణలు నిర్వహిస్తూ అనేక సమస్యలు అపరిస్కృతంగా మారినాయని ఆరోపించారు.

- Advertisement -

తక్షణమే సింగరేణిలో ఎన్నికల నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. కేంద్ర ఎన్నికల సెంట్రల్ లేబర్ కమిషనర్ నుండి క్లియరెన్స్ వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో అనేక అవరోధాలు సృష్టిస్తున్న సింగరేణి యాజమాన్యం తక్షణమే ఎన్నికలు నిర్వహించడం కోసం చర్యలు తీసుకోలేని పక్షంలో న్యాయపోరాటం చేసేనా ఎన్నికలు నిర్వహించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎం ఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, పవన్ కుమార్, రమాకాంత్, రాజారెడ్డి, కార్యవర్గ సభ్యులు, పొన్నమనేని వేణుగోపాలరావు, వై సారంగపాణి, ఆకుల హరిణ్, సాయవేణి సతీష్, మాదాసు రవీందర్ కేంద్ర కమిటీ సభ్యులు, వడ్డేపల్లి కుమారస్వామి, మామిడి స్వామి, పెంచాల వెంకటస్వామి, తాట్ల లక్ష్మయ్య, పల్లె శ్రీనివాస్, తుమ్మ గట్టయ్య, పోతరాజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News