Tuesday, September 24, 2024
HomeతెలంగాణPost cards movement: మోడీకి పోస్టుకార్డులు

Post cards movement: మోడీకి పోస్టుకార్డులు

బీసీ జనగణన చేయాల్సిందే

మంచిర్యాల పట్టణంలోని బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీకి పోస్టు కార్డులు పంపుతూ నాయకులు మాట్లాడారు… 1931లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం బీసీ గణన చేపడితే దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పుడున్న ప్రభుత్వాలు బీసీ గణన చేపట్టకపోవడం అంటే పూర్తిగా బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరిగా భావిస్తున్నాం. దేశంలో గుర్తింపు పొందిన 27 రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇవ్వడం జరిగింది తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని, అలాగే పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి బీసీ జనగణన చేపడతామని హామీ ఇచ్చారని, దానికంటే ముందు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే బీసీకి జనగణన చేపడతామని హామీ ఇచ్చామని వీరు గుర్తుచేశారు. కానీ అధికారంలోకీ వచ్చి తొమ్మిది సంవత్సరాలు దాటిన బీసీ గణనపై పెదవి విప్పక పోవడం అంటే ఇది పూర్తిగా బీసీలను వ్యతిరేకించడమే అవుతుందని అన్నారు. ఇప్పటికైనా బీసీల న్యాయమైన డిమాండ్ అయినా బీసీ జనగణన చేపట్టి పంచాయతీ నుండి పార్లమెంటు దాకా విద్యా, ఉద్యోగాలలోనే కాకుండా అన్ని రంగాల్లో సమాన వాటా దక్కాలంటే బీసీ జనగణన మాత్రమే పరిష్కారం అన్నవిషయం కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో బిజెపి ప్రభుత్వానికి బీసీ సమాజం గుణపాఠం చెప్పక తప్పదు అని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గుమ్ముల శ్రీనివాస్, కో-కన్వీనర్ సంఘం లక్ష్మణ్, వడ్డేపల్లి మనోహర్, పిఎసిఎస్ చైర్మన్ సందెల వెంకటేష్, బీసీ నాయకులు గడ్డం సతీష్ యాదవ్, జిల్లా అధ్యక్షులు సూరినేని కిషన్, నార్ల మహేందర్ కంచర్ల కొమరయ్య, బీసీ విద్యార్థి సంఘం నాయకులు నస్పూరి అఖిల్, బోడంకి మహేష్, రాసమల్ల కుమార్, కీర్తి బిక్షపతి, శేఖర్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News