తెలంగాణ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తుందని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నేరేడుచర్ల రామాపురం బీసీ బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల విద్యా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు, ఎన్సిసి విద్యార్థులు పెరేడ్ ద్వారా ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో చదువుతున్న ఒక్కో విద్యార్థులకు 1,50,000/ఖర్చు చేస్తుందన్నారు, గురుకులాల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు, గురుకుల పాఠశాలలో, కళాశాలలో సీట్లు దొరకటం కష్టంగా ఉందన్నారు, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉద్యోగాలు సాధించాలని అన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు, ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు,పెద్దలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
కల్లూరు ప్రాథమిక పాఠశాలలో విద్యా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన విద్యా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు, ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు, అనంతరం ఆయన మాట్లాడుతూ మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా కల్లూరు పాఠశాల ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు, రాష్ట్ర ప్రజలందరికీ సీఎం కేసీఆర్ ఎప్పుడు అండగా ఉంటారని చెప్పారు, ప్రభుత్వ సహకారంతో పల్లెలు పచ్చగా కళకళలాడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు,పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.