Thursday, April 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Allagadda: టీమ్ జగనన్న టాప్ పెర్ఫార్మర్స్ కు సన్మానం

Allagadda: టీమ్ జగనన్న టాప్ పెర్ఫార్మర్స్ కు సన్మానం

దేశంలోనే డైనమిక్ సీఎం

ఆళ్ళగడ్డ నియోజకవర్గం పరిధిలోని వైస్సార్సీపీ సోషల్ మీడియా ‘టీమ్ జగనన్న’ యాప్ ద్వారా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. టాప్ 05 పెర్ఫార్మన్స్ లను సన్మానించారు ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పేర్కొన్న పధకాలన్నీ 98.3%ప్రజలకు అందించటంలో దేశంలోనే డైనమిక్ సీఎంగా పేరుగాంచి, ముఖ్యంగా విద్య & వైద్యంలో పెనుమార్పులు చేసి అందరికి మెరుగైన వైద్యం & విద్యను అందించటంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసే మహోన్నతమైన వ్యక్తిన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసే టీమ్ జగనన్న యాప్ ద్వారా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్న పాలుట్ల నాగేంద్ర, గుర్రం అనిల్ కుమార్, లింగ భూపతి రెడ్డి, మల్లికార్జునరెడ్డి, అంబరపు ప్రసాద్ ను సన్మానించి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ మిల్క్ డైరీ చైర్మన్ రెడ్డి కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి, డాక్టర్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News