Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: గంగమ్మ ఆలయ అభివృద్ధికి 50 వేల కానుక

Gangula: గంగమ్మ ఆలయ అభివృద్ధికి 50 వేల కానుక

ఉయ్యాలవాడ మండలం ఆర్ జంబులదిన్నెలో గంగమ్మ జాతర

ఆలయాల అభివృద్ధి మన సంస్కృతిలో భాగమని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. ఉయ్యాలవాడ మండలం ఆర్ జంబులదిన్నె గ్రామంలో జరుగుతున్న గంగమ్మ జాతర సందర్భంగా గ్రామస్తులు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు YCP నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు గంగమ్మ దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సందర్భంగా గంగమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికై 50 వేల రూపాయలు కానుకగా ఆయన ఆలయ కమిటీ వారికి అందజేశారు. అనంతరం గ్రామ నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో ఎమ్మెల్యే గంగుల ప్రాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బుడ్డా చంద్రమోహన్ రెడ్డి గంగుల రామిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి, ఎస్సైలు, సత్యనారాయణ, తిరుపాల్, కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి, డాబా మనోహర్ రెడ్డి ,రాజగోపాల్ రెడ్డి, మండల వైఎస్సార్ సీపీ నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News