Friday, November 22, 2024
Homeహెల్త్loosing weight: బ్లాక్ కాఫీతో బరువు తగ్గచ్చు

loosing weight: బ్లాక్ కాఫీతో బరువు తగ్గచ్చు

శరీరంలోని ఫ్యాట్ ను బాగా కరిగించి, జీవక్రియ బాగా పెరిగేలా..

బరువు తగ్గడానికి రకరకాల మార్గాలను అనుసరిస్తుంటాం. అలాంటి పద్ధతుల్లో ఒకటి బ్లాక్ కాఫీ తాగడం. దీనివల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఎలాంటి డైట్ తీసుకుంటే బరువు తగ్గుతామనే విషయంలో వ్యక్తులు అవగాహన కలిగి ఉండాలి. మరొకటి సరైన టైములో తినడం, తాగడం చేయాలి. బరువు తగ్గాలంటే ఇవి చాలా ముఖ్యమైన విషయాలు.
బ్లాక్ కాఫీ విషయానికి వస్తే ఇది శరీరంలోని ఫ్యాట్ ను బాగా కరిగిస్తుంది. దీనివల్ల జీవక్రియ బాగా జరుగుతుంది. ఫలితంగా జీర్ణశక్తి బాగుపడుతుంది. బ్లాక్ కాఫీ తాగితే బరువు తగ్గుతారు. అయితే బ్లాక్ కాఫీని ఏవిధంగా తాగుతున్నారన్నది కూడా బరువు తగ్గడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. బ్లాక్ కాఫీని సరైన పద్ధతిలో తాగడమే కాదు డైట్, వ్యాయామాల విషయంలో కూడా క్రమశిక్షణను పాటించాలి. ఫ్యాట్ కరగాలంటే బ్లాక్ కాఫీ తీసుకునే ప్రత్యేక పద్ధతి ఒకటి ఉంది. బ్లాక్ కాఫీ లో పాలు కలపకూడదు. చక్కెర కూడా వాడకూడదు. కాఫీ డికాషన్ ను మాత్రమే వేడి చేసి తాగాలి. రోజు మొత్తంలో నాలుగు కప్పుల బ్లాక్ కాఫీ తాగొచ్చు. చక్కెర లేని డికాషన్ కాఫీనే తాగాలి.

- Advertisement -

ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగిన తర్వాత తప్పనిసరిగా రెండు కప్పుల నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య తలెత్తదంటున్నారు పోషకాహారనిపుణులు. ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం వల్ల దగ్గరగా 17 వరకూ అదనపు కాలరీలు కరుగుతాయి. రోజుకు రెండు కప్పుల బ్లాక్ కాఫీ తాగినట్టయితే జీవక్రియను మరింత పెంచుతుంది. వ్యాయామాలు చేయడానికి ముందర 300 మిల్లీగ్రాముల కెఫైన్ తీసుకుంటే వర్కవుట్లు బాగా చేయగలుగుతారు. బ్లాక్ కాఫీ విషయంలో గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కాఫీ కాఫీకి కెఫైన్ పరిమాణంలో తేడా కనిపిస్తుంది. బ్లాక్ కాఫీ తీసుకున్న ఆరేడు గంటల తర్వాత ఫ్యాట్ కరుగుతుంది. గ్లకోమా, నిద్రలేమి, ఎముకల లోపం, మూత్రసంబంధమైన సమస్యలు, యాంగ్జయిటీ ఉన్న వారు బ్లాక్ కాఫీకి దూరంగా ఉంటే మంచిది. బ్లాక్ కాఫీ డిప్రషన్ ను తగ్గిస్తుంది. అంతేకాదు కాలేయ సమస్యలను నుంచి సాంత్వననిస్తుంది. రాత్రి నిద్రపోవడానికి ఆరు గంటల ముందు మాత్రమే బ్లాక్ కాఫీ తాగాలి. ఆ తర్వాత కాఫీని అస్సలు తీసుకోకూడదు. అలా కనుక తాగితే రాత్రి నిద్దపట్టదు. అలాగే నిత్యం బ్లాక్ కాఫీ తాగడం అలవాటుగా పాటిస్తే కూడా బరువు తగ్గుతారు. ఈ విషయాలను మనసులో పెట్టుకోండి…బ్లాక్ కాఫీతో బరువు తగ్గండి…ఏమంటారు?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News