తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గంలోని అన్ని మతాల దేవాలయాల్లో ప్రార్థనలు చేశారు.. ముందుగా కూకట్పల్లిలోని రామాలయంలో వేద పండితులు సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేరుపై ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కెపిహెచ్బి రోడ్ నెంబర్ ఒకటిలోని ట్రినిటీ చర్చిలో పాస్టర్స్ సమక్షంలో ప్రార్ధనలో పాల్గొన్నారు..అనంతరం బాలానగర్ లోని గురుద్వారాలో ప్రార్థన నిర్వహించారు.
అనంతరం బోయిన్పల్లిలోని మసీదులో ముస్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అన్ని మతాలు, కులాలు కలిసి అందరూ అన్నదమ్ములా ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నామని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని మతాలు దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు.
యాదాద్రి దేవాలయం గత ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యం చేశాయో.. నేడు ఆ దేవాలయం చూడడానికి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు వస్తున్నారంటే అది కేసీఆర్ పుణ్యఫలమేనని.. చర్చిలు మసీదులు.. గురుద్వారాలు వంటి అన్ని దేవాలయాలకు నిధులు కేటాయిస్తూ అన్ని మతాల పండుగలకు వారి వారి సంప్రదాయానికి అనుగుణంగా దుస్తులు అందిస్తూ ప్రోత్సాహకాలు కేసీఆర్ అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ.. మందాడి శ్రీనివాసరావు.. ఆవుల రవీందర్ రెడ్డి.. ముద్దం నరసింహ యాదవ్.. డి సీ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు…