Karun Nair : క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే అభిమానులకు కరుణ్ నాయర్‌ను పరిచయం చేయాల్సిన పని లేదు. భారత్ తరుపున టెస్టు క్రికెట్‌లో విధ్వంసకర వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ తరువాత ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఘనతను సొంతం చేసుకున్నాడు. అదీ తన అరంగ్రేటం టెస్టు సిరీస్‌లో కావడం విశేషం. 2016లో చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 303 పరుగులు చేశాడు. దీంతో భవిష్యత్తులో అతడు గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడని అంతా భావించారు.
అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంత ఘనంగా ఎంట్రీ ఇచ్చాడో అంతే తొందరగా కనుమరుగు అయిపోయాడు. 2017లో ఆస్ట్రేలియాతో మ్యాచుల్లో వరుస వైఫల్యాల కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ఇక అంతే మరోసారి టీమ్ఇండియాకు అతను ఆడలేదు. అతను ఉన్నాడు అన్న సంగతి కూడా సెలక్టర్లు మరిచిపోయినట్లే ఉన్నారు. దేశవాలీ క్రికెట్‌లో అడపాదడపా మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా అతడిని పట్టించుకునే నాథుడే కరువు అయ్యాడు. ఈ క్రమంలో గతంలో ఓ సందర్భంలో అతడు మాట్లాడుతూ టీమ్ఇండియా జట్టు నుంచి ఎందుకు తప్పించారో కూడా తనకు ఎవరూ చెప్పదని ఆవేదన వ్యక్తం చేశాడు.
కనీసం దేశవాలీ క్రికెట్ అయినా ఆడుతున్నాడే అని అనుకుంటుండగా అక్కడా కూడా జట్టులో చోటు దక్కడం లేదు. ముస్తాక్ అలీ, విజయ్ హజారే టోర్నీలో రాష్ట్రస్థాయి జట్టులో కూడా చోటు లభించలేదు. ఈ నేపథ్యంలో కరుణ్ నాయక్ ట్విట్టర్ వేదికగా భావోద్వేగ పోస్టును చేశాడు. “డియర్ క్రికెట్.. నాకు మరొక్క అవకాశం ఇవ్వు” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
‘బ్రదర్ నీ ట్రిపుల్ సెంచరినీ మేమింకా మరిచిపోలేదు. నువ్వు ఖచ్చింతంగా టెస్టు జట్టులో చోటు దక్కించుకుంటావు ‘అని నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.