Saturday, November 23, 2024
HomeతెలంగాణChevella: బళ్లో అన్నీ ఇస్తున్నాం, బాగా చదువుకోండి

Chevella: బళ్లో అన్నీ ఇస్తున్నాం, బాగా చదువుకోండి

సర్కారు బడులకు సకల సౌకర్యాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సర్కారు బడులకు సకల సౌకర్యాలు కల్పించామని, విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకొని ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నారు విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా స్కూల్ బిల్డింగును విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రారంభించారు.

- Advertisement -

మొయినాబాద్ రెసిడెన్సియల్ పాఠశాలలో ఒక కోటి రూపాయలతో నిర్మించే ల్యాబ్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా లైబ్రరీ కార్నర్ ను ప్రారంభించి విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ లు పంపిణీ చేసి విద్యార్థులకు రాగి జావా అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు పౌష్టికాహారంతోపాటు కార్పొరేట్ లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించగలుగుతున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి బలోపేతానికి కృషిచేస్తున్నారని వారన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో సబితా ఇంద్రారెడ్డి సారథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు నూతన హంగులు సంతరించుకుంటున్నాయని అన్నారు. మన ఊరు మన బడి తో 12 రకాల సదుపాయాలు కల్పించి అభివృద్ధి పరుస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ యూనిఫాం, పాఠ్యపుస్తకాలను అందజేశారు.


కార్యక్రమంలో ఎంపిపి నక్షత్రం, జెడ్పీటీసీ కాలె శ్రీకాంత్, వైస్ ఎంపిపి మమతా, బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు స్వప్న, పలు గ్రామాల సర్పంచులు శ్రీనివాస్ ముదిరాజ్, అజీజ్ నగర్ సర్పంచ్ , హిమాయత్నగర్ సర్పంచ్ ముదిగొండ మంజుల, చిలుకూరు సర్పంచ్ స్వరూప, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, బిఅర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News