జుట్టును ఒత్తుగా పెంచే హెర్బ్స్
వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడే కొన్ని సహజ మూలికలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో మందారం ఒకటి. ఇది సహజసిద్ధమైంది. ఇది వెంట్రుకలను నిగ నిగలాడేలా చేస్తుంది. అంతేకాదు రక్తప్రసరణ బాగా జరిగేలా చేయడం ద్వారా శిరోజాలు బాగా పెరిగేలా సహకరిస్తుంది. ఇంకొక హెర్బ్ పిప్పర్మింట్. ఇది శిరోజాలు బాగా పెరిగేలా చేస్తుంది. అంతేకాదు జుట్టు రాలకుండా కూడా సహకరిస్తుంది. రోజ్ మేరీ ఆయిల్ ని ఇంట్లో తయారుచేసుకుని దాన్ని తలకు రాసుకుంటే రక్తప్రసరణ బాగా జరిగి శిరోజాలు బాగా పెరిగేలా ఈ ఆయిల్ చేస్తుంది. లావండర్ జుట్టును పట్టులా ఉంచుతుంది. జుట్టు నల్లగా నిగ నిగలాడేందుకు, బాగా పెరిగేందుకు తగినంత మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. నెటిల్ హెర్బ్ జుట్టు రాలకుండా శక్తివంతంగా సహకరిస్తుంది. అంతేకాదు జుట్టు తిరిగి పెరిగేలా తోడ్పడుతుంది.
అలొవిరాను మాడుకు బాగా పట్టిస్తే జుట్టు పెరుగుతుంది. ఉసిరి ఇంకొక శక్తివంతమైన హెర్బ్. దెబ్బతిన్న శిరోజాల లోపలికి చొచ్చుకుపోయి మరీ శిరోజాలను కుదుళ్ల కంటా ద్రుఢంగా ఉండేలా చేస్తుంది. మెంతులు కూడా మరో మంచి హెర్బ్. జుట్టు రాలకుండా మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు జుట్టు పలచబడకుండా కూడా ఇవి పరిరక్షిస్తాయి.