Tuesday, September 24, 2024
HomeతెలంగాణMallapur: లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

Mallapur: లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

సేవా కార్యక్రమాల్లో జిల్లాలో మొదటి స్థానంలో ఉంటాం

మల్లాపూర్ మండల లయన్స్ క్లబ్ కరీంనగర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మల్లాపూర్ మండల కేంద్రంలో ఉన్న వాసవి మాత ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. నూతన లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా కనుక సంజీవ్, కార్యదర్శిగా తోట రాజారెడ్డి, కోశాధికారిగా ఎర్రి జైపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కమిటీని సభ్యులను పలువురు ప్రముఖులు, అధికారులు, నాయకులు, నూతన పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెండో వైస్ డిస్ట్రిక్ గవర్నర్ సింహరాజు కోదండరాములు, హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ అధ్యక్షులు కనుక సంజీవ్ మాట్లాడుతూ మల్లాపూర్ మండల లైన్స్ క్లబ్ సేవలు జిల్లాలోని మొదటి స్థానంలో ఉంచుతానని వీలైనన్ని సేవా కార్యక్రమాలు చేసి లయన్స్ క్లబ్ సేవలు గ్రామ గ్రామాన అందేలా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ రవీందర్, ఎంపీడీవో రాజా శ్రీనివాస్, రాయికల్ మున్సిపల్ కమిషనర్ గంగుల సంతోష్ కుమార్, మల్లాపూర్ ఎంపిఓ జగదీష్, ఈవో భూమేష్, ఎస్సై నవీన్ కుమార్, ఏవో లావణ్య, లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ డాక్టర్ దిలీప్ రావు, లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ శివ శ్రీనివాస్, లైన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News