Armaan Malik: రెండు పెళ్లిళ్లు చేసుకోవడాన్ని సాధారణంగా అంగీకరించని సమాజం మనది. ఎవరైనా అలా పెళ్లి చేసుకున్నప్పటికీ, దాని గురించి బహిరంగంగా వెల్లడించడానికి ఇష్టపడరు. అలాంటిది ఒక వ్యక్తి తన ఇద్దరు భార్యల గురించి సోషల్ మీడియాలో చెప్తే నెటిజన్లు ఊరుకుంటారా? అందులోనూ ఆ ఇద్దరు భార్యలూ ఒకేసారి ప్రెగ్నెంట్స్ అని తెలిస్తే నెటిజన్లు ఆడేసుకుంటారు.
ప్రస్తుతం ఒక యూట్యూబర్‌ను అలాగే ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ ఆర్మాన్ మాలిక్‌కు ఇద్దరు భార్యలు. పాయల్ అనే మహిళను 2011లో పెళ్లి చేసుకున్నాడు. వాళ్లిద్దరికీ చిరాయు మాలిక్ అనే కొడుకు కూడా ఉన్నాడు. తర్వాత 2018లో క్రితిక అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈమె ఆర్మాన్ మొదటి భార్య పాయల్‌కు స్నేహితురాలు. ప్రస్తుతం చిరాయు, క్రితిక మధ్య మంచి స్నేహం కూడా ఉంది.
కాగా, ఇప్పుడు ఇద్దరూ ప్రెగ్నెంట్స్. ఈ విషయాన్ని ఆర్మాన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. గర్భంతో ఉన్న ఇద్దరితో కలిసి తీసుకున్న ఫొటోలు షేర్ చేశాడు. దీనిపైనే నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇద్దరు భార్యలు కలిగి ఉండటం, ఇద్దరూ ఒకేసారి ప్రెగ్నెంట్ అవ్వడంపై విమర్శలు చేస్తున్నారు. ఇంకొందరైతే ఇద్దరిలోకి ఆర్మాన్ మాలిక్‌కు క్రితిక అంటేనే ఇష్టమని, పాయల్ అంటే తక్కువ ఇష్టమని, అందుకే ఎక్కువ ఫొటోలు క్రితికతోనే ఉంటాయని విమర్శిస్తున్నారు.
‘టైమింగ్’ అంటే ఆర్మాన్‌దే అని మరికొందరు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. ఆర్మాన్ మాలిక్‌కు యూట్యూబర్‌గా మంచి గుర్తింపు ఉంది. ఆయన ఛానెల్‌కు 2 మిలియన్లకుపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ అతడికి మంచి గుర్తింపు ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఆర్మాన్ తన వీడియోలు, సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటారు.