ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గంలో చిల్లర రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని ఇది సరైన విధానం కాదని, చిల్లర మల్లర రాజకీయాలను ప్రోత్సహిస్తే సహించేది లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ హుజరాబాద్ అసెంబ్లీ స్థాయి మోర్చాల సంయుక్త సమావేశం జమ్మికుంట పట్టణంలోని శంకర్ నందన గార్డెన్ లో ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారు. 9 ఏళ్లలో ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నారో అర్థం కావడం లేదన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంకా 17 వేల మంది లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో దళిత బంధు పథకాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ పార్టీకి మోర్చాలు పట్టుకొమ్మలని మోర్చాలు బలంగా ఉంటేనే పార్టీ ముందుకు సాగుతుందని, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 9 సంవత్సరాల సుపరి పాలన దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లి అంకితభావంతో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, మోర్చాల సంయుక్త కన్వీనర్ జాడి బాల్రెడ్డి, బింగి కరుణాకర్, పుప్పాల రఘు, చిన్న మాధవ్, నరసింహ రాజు, పొనగంటి శంకరయ్య, బిజెపి మండల అధ్యక్షులు సంపెల్లి సంపత్ రావు, రామడి ఆది రెడ్డి, సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, కట్కూరి అశోక్ రెడ్డి, గంగిశెట్టి రాజు, రావుల వేణు, ఇంగ్లీ ప్రభాకర్, తుమ్మ శోభన్ బాబు, నాంపల్లి సుమన్ తదితరులు పాల్గొన్నారు.