వచ్చే ఎన్నికల్లో తానెక్కడా పోటీ చేయట్లేదని.. తన కుమారుడు అమిత్ రెడ్డికి పార్టీ అవకాశం ఇస్తే పోటీలో ఉంటారని స్పష్టంచేశారు బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి. జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో 12 స్థానాలు మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందన్న గుత్తా, పార్టీలో మార్పులు చేర్పులు చేస్తే కొత్త వారికి అవకాశం ఉంటుందన్నారు. కాంగ్రెస్ నాయకులు కొంత మంది BRS పార్టీలో చేరే అవకాశం ఉందని, కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమంటూ ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంపైన సమగ్ర అవగాహన కలిగిన ఏకైక నాయకుడు ఒక్క కేసీఆర్ మాత్రమేనని, రెండు జాతీయ పార్టీల అధ్యక్షులకు రాష్ట్రంపై ఎలాంటి అవగాహన లేదన్నారు. బిజెపి, కాంగ్రెస్ నేతలవి పగటి కలలు మాత్రమేనన్నారు.
వారసుల కోసం వేరే పార్టీలోకి వెళ్ళమన్న ఆయన.. అవకాశం రాకపోతే పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతిస్తామంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తన కెరీర్ అంతా పదేపదే పార్టీలు మారిన గుత్తా ఇప్పుడు ఇలా చెప్పటం హైలైట్.