Saturday, November 23, 2024
Homeహెల్త్Grey hair: తెల్ల జుట్టు పోయేదెలా?

Grey hair: తెల్ల జుట్టు పోయేదెలా?

చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుందంటే..

తెల్ల వెంట్రుకలను ఇలా సహజంగా పోగొట్టుకోవచ్చు..

- Advertisement -

తెల్ల వెంట్రుకలను తగ్గించుకోవాలనుకుంటున్నారా? దీనికి కొన్ని సహజ చిట్కాలు ఉన్నాయి. ఒకటి ఆమ్లా ఉన్న కొబ్బరినూనెతో మాడును మసాజ్ చేసుకుని 45 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇలా చేస్తే తలలోని తెల్లవెంట్రుకలు తగ్గుతాయి. ఇందుకు  మూడు నుంచి ఐదు ఉసిరికాయలు, ఒక కప్పు కొబ్బరినూనె తీసుకోవాలి. ఒక కప్పు కొబ్బరినూనెలో ఈ ఉసిరికాయలను ఉడకబెట్టి చిక్కని నూనెలా తయారుచేయాలి. దీన్ని ఒక జార్ లో భద్రం చేసి రెండు టేబుల్ స్పూన్ల నూనెను తలకు పట్టించుకుంటుండాలి. దీన్ని నుదురుపై బాగా మసాజ్ చేయాలి. రోజు మార్చి రోజు ఈ నూనెను రాసుకుని రాత్రి దానితో అలాగే పడుకోవాలి. ఈ నూనెను పది హేను నిమిషాలపాటు వెంట్రుకలకు మసాజ్ చేసకున్న తర్వాత మరో అరగంటపాటు వెంట్రుకలను అలాగే వదిలేయాలి. తర్వాత సల్ఫేట్ లేని షాంపుతో తలను రద్దుకోవాలి. తర్వాత వెంట్రుకలకు కండిషనర్ పెట్టుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఒక కప్పు బ్లాక్ టీ తీసుకుని దాన్ని జుట్టుకు పట్టిస్తే కూడా తలలోని తెల్ల వెంట్రుకలు తగ్గుతాయి. బ్లాక్ టీలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీరాడికల్స్ వెంట్రుకలను దెబ్బతీయకుండా ఇవి కాపాడతాయి. చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకల బారిన పడకుండా బ్లాక్ టీ పరిరక్షిస్తుంది. వెంట్రుకలను నిగ నిగలాడేట్టు చేస్తుంది. బ్లాక్ టీ ఒత్తిడి నుంచి సైతం మిమ్మల్ని బయట పడేస్తుంది. దీంతో తెల్ల జుట్టు సమస్య తలెత్తదు. ఇది తయారు చేయడానికి మీరు రెండు టేబుల్ స్పూన్ల బ్లాక్ టీ, ఒక కప్పు నీళ్లు తీసుకుని రెడీ పెట్టుకోవాలి. వీటిని ఉడికించి చల్లారనివ్వాలి. తర్వాత దాన్ని ఒడగట్టి వెంట్రుకలకు, మాడుకు పెట్టుకొని రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత గంటసేపు వెంట్రుకలను అలాగే వదిలేయాలి. తేలికపాటి సల్ఫేట్ లేని షాంపుతో తలను రుద్దుకొవాలి. చివరలో జుట్టుకు కండిషనర్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మాడుకు కరివేపాకు, కొబ్బరినూనె మిశ్రమాన్ని రాసుకుని 45 నిమిషాలు అలాగే వదిలేసినా కూడా తెల్లజుట్టు తగ్గుతుంది. కరివేపాకు ఆకులు జుట్టు సహజ టోన్ ను పరిరక్షిస్తాయి. జుట్టు తొందరగా తెల్లబడకుండా కాపాడతాయి. కొబ్బరినూనె జుట్టు కుదుళ్ల వరకూ బాగా ఇంకి జుట్టును నిగనిగలాడేట్టు చేయడమే కాకుండా శిరోజాలు బాగా పెరిగేలా కూడా చేస్తుంది. ఇందుకోసం గుప్పెడు కరివేపాకు ఆకులు, మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె రెడీ పెట్టుకోవాలి.  మొదటగా కరివేపాకు ఆకులను కొబ్బరినూనెలో వేసి బాగా ఉడికించి ఆయిల్ సొల్యూషన్ లా చేయాలి. తర్వాత దాన్ని చల్లార్చాలి. అది చల్లారిన తర్వాత వడగట్టి దానితో మాడును మసాజ్ చేయాలి. జుట్టుకు కూడా దీన్ని పట్టించాలి. పది హేను నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత వెంట్రుకలను అలాగే అరగంట పాటు వదిలేయాలి. రోజు మార్చి రోజు రాత్రి తలకు ఈ నూనె పెట్టుకుని ఉదయం వరకూ అలాగే వదిలేయాలి. పొద్దున్న లేచిన తర్వాత మైల్ఢ్ సల్ఫేట్ ఫ్రీ షాంపుతో తలను రద్దుకుని చివర్లో తలకు కండిషనర్ పెట్టుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు పెట్టుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

మాడుకు కొబ్బరినూనె, నిమ్మరసాలను కలిపి రాసుకుని అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల తలలోని తెల్ల వెంట్రుకలు పోతాయి. నిమ్మకాయలో విటమిన్ సి బాగా ఉంటుంది. ఇది ఎంతో శక్తివంతమైన యాంటాక్సిడెంట్. ఫ్రీరాడికల్స్ ను ఇది న్యూట్రలైజ్ చేస్తుంది. జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది.  ఇందుకోసం రెండు టీస్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను రెడీ పెట్టుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెలో రెండుటీస్పూన్ల నిమ్మరసం పోసి ఆ మిశ్రమాన్ని రెండు సెకన్లపాటు వేడిచేసి కొద్దిగా గోరువెచ్చగా కాగానే కిందికి దించాలి దానితో మాడు,  వెంట్రుకలకు బాగా మాసాజ్ చేయాలి. తర్వాత అరగంటపాటు అలాగే వదిలేయాలి. తర్వాత మైల్డ్ సల్ఫేట్ ఫ్రీ షాంపుతో తలను రుద్దుకుని చివరలో కండిషనర్ ను తప్పకుండా పెట్టుకోవాలి.

ఆముదం, ఆవ నూనెలను కలిపి మాడుకు రాసుకుని 45 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల కూడా తలలో తెల్లవెంట్రుకలు ఉండవు. ఆముదం నూనె కుదుళ్ల వరకూ రక్తప్రసరణ జరిగేలా చేస్తుంది. ఇందులో ఒమేగా6 ఎసెన్షియల్ ఫ్యాటీ  యాసిడ్లు ఉన్నాయి. ఇవి శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా జుట్టు నల్లగా నిగ నిగలాడేట్టు చేస్తాయి. ఇందుకు ఒక టేబుల్ స్పూన్ ఆముదం నూనె, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి రెండు నిమిషాలు వేడిచేయాలి. అది కాస్త గోరువెచ్చగా కాగానే కిందికి దించాలి. ఈ ఆయిల్ మిశ్రమాన్ని మాడుకు, జుట్టు చివళ్లకంటా బాగా పట్టించాలి. పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత వెంట్రుకలను అలాగే అరగంట పాటు వదిలేయాలి. తర్వాత సల్ఫేట్ ఫ్రీ షాంపుతో తలను రుద్దుకొని కండిషనర్ పెట్టుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు జుట్టుకు పెట్టుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్య పరిష్కారమవుతుంది. 

నానబెట్టిన మెంతులను మెత్తగా చేసి ఆ పేస్టును మాడుకు రాసుకుని 45 నిమిషాలు అలాగే వదిలేయడం వల్ల కూడా తెల్ల వెంట్రుకల సమస్య పరిష్కారమవతుంది. మెంతుల్లో బి విటమిన్స్, సపొనిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు రాలకుండా కాపాడుతుంది. అంతేకాదు జుట్టు సహజ రంగును సైతం ఇది కాపాడుతుంది. చుండ్రును పోగొడుతుంది. జుట్టును సిల్కీగా ఉంచుతుంది. ఇందుకు రెండు టేబుల్ స్పూన్ల మెంతులు, పావు కప్పు నీళ్లు రెడిగా పెట్టుకోవాలి. పావు కప్పు నీళ్లల్లో మెంతులు నానబెట్టి రాత్రంతా వాటిని అలాగే ఉంచాలి. పొద్దున్న నానిన మెంతులను మెత్తగా గ్రైండ్ చేసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును జుట్టుకు, మాడుకు బాగా పట్టించి 45 నిమిషాలు అలాగే వదిలేయాలి.  ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయాలి.

ఉల్లిపాయ రసం, ఆలివ్ ఆయిల్ రెండింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టించి అరగంటపాటు అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు లో తెల్ల వెంట్రుకలు రావు. ఇందుకు ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్, ఒక చీస్ క్లాత్ కావాలి. ఉల్లిపాయను చిన్న ముక్కలుగా చేసి ఒక టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్ తో కలిపి మెత్తగా చేయాలి. ఛీజ్ క్లాత్ ను ఉపయోగించి ఆ గుజ్జు నుంచి రసాన్ని పిండాలి. ఈ రసాన్ని మాడుకు పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత 35 నిమిషాల పాటు జుట్టును అలాగే వదిలేయాలి. తర్వాత మైల్డ్ సల్ఫేట్ ఫ్రీ షాంపుతో తలను రుద్దుకోవాలి. చివర్లో జుట్టుకు కండిషనర్ పెట్టుకోవడం మరవొద్దు. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

హెన్నా, కాఫీ హెయిర్ ప్యాక్ ను మాడుకు, వెంట్రుకలకు పట్టించి అలాగే మూడు నుంచి నాలుగు గంటలు వదిలేయడం వల్ల కూడా తెల్లజుట్టు సమస్య తగ్గుతుంది. హెన్నా రాసుకోవడం వల్ల తెల్ల జుట్టు కనపడదు. హెన్నా వెంట్రుకలకు ఎరుపు రంగు టోన్ ను ఇస్తే, మరో హెయిర్ కలరెంట్ అయిన కాఫీ బ్లాకిష్ బ్రౌన్ టోన్ ను జుట్టుకు ఇస్తుంది. రసాయనాలు లేని హెన్నా పొడిని వాడాలి. ఇందుకు ఐదు టేబుల్ స్పూన్ల హెన్నా పొడి, ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి, ఒక కప్పు వాటర్ అవసరం అవుతాయి. కప్పు నీళ్లల్లో కాఫీ పొడి వేసి ఉడకబెట్టాలి. అందులో ఐదు టేబుల్ స్పూన్ల హెన్నా పొడి వేసి ఉండగట్టకుండా మెత్తగా కలపాలి. ఆ పేస్టును మాడుకు, జుట్టుకు పట్టించి మూడు లేదా నాలుగు గంటలపాటు అలాగే వెంట్రుకలను వదిలేయాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో తల కడుక్కుని మైల్డ్ సల్ఫేట్ ఫ్రీ షాంపుతో తలను రుద్దుకోవాలి. ఇలా వారానికి

మూడుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.  నువ్వుల నూనె, కొబ్బరినూనెలను కలిపి ఆ మిశ్రమంతో మాడును మసాజ్ చేసి 45 నిమిషాలు అలాగే వదిలివేయాలి. ఇలా చేయడం వల్ల కూడా తెల్లజుట్టు సమస్య పరిష్కారమవుతుంది.

కొబ్బరినూనె కుదుళ్ల వరకూ ఇంకుతుంది. నువ్వుల నూనె జుట్టును నల్లగా నిగ నిగలాడేట్టు చేస్తుంది. ఇందుకు రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కావాలి. ఈ రెండింటినీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేలా వేడిచేయాలి. తర్వాత దాన్ని వెంట్రుకలుకు, మాడుకు పట్టించి పదిహేను నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత వెంట్రుకలకు టవల్ చుట్టి, దాన్ని అరగంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత మైల్డ్ సల్ఫేట్ షాంపుతో తలను రుద్దుకుని చివర్లో కండిషనర్ పెట్టుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. అలాగే ఉసిరి, మందార పూవు పేస్టు రెండింటినీ బాగా కలిపి హెయిర్ ప్యాక్ గా వేసుకోవాలి. తర్వాత దాన్ని 45 నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. ఈ మాస్కు జుట్టు కుదుళ్లను ద్రుఢం చేస్తాయి.

అంతేకాదు శిరోజాలను బలిష్టంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చిన్నవయసులోనే తెల్ల జుట్టు రాకుండా మందారం నిరోధిస్తుంది. దీనికి హెయిర్ కండిషనింగ్ గుణం కూడా ఉంది. దీన్ని తయారు చేయడానికి మూడు టేబుల్ స్పూన్ల మందార ఆకులు, మందార పువ్వులను తీసుకుని మెత్తగా చేయాలి. అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఆమ్లా పొడి, నీళ్లు కూడా కావాలి. మందార ఆకులు,పువ్వులు రెండూ కలిపిన గుజ్జు, ఆమ్లా పొడి రెండింటినీ బాగా కలిపి మెత్తటి పేస్టులా చేయాలి.  అవసరమైతే అందులో కొద్దిగా నీరు కలపొచ్చు. ఆ మిశ్రమాన్ని మాడుకు, వెంట్రుకల చివరికంటా పట్టించి అలాగే 45 నిమిషాలు వదిలేయాలి. తర్వాత మైల్డ్ సల్ఫేట్ ఫ్రీ షాంపుతో తలను రుద్దుకోవాలి. చివర్లో వెంట్రుకలకు కండిషనర్ పెట్టుకోవడం మరవొద్దు. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

తెల్లజుట్టు ఎందుకు వస్తుందంటే..

పడుచు వయసులోనే మీకు తెల్ల జుట్టు వస్తే దానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి సమతులాహారం తీసుకోకపోవడం. పోషకాహార లోపం, విటమిన్ బి12, ప్రొటీన్ల ప్రమాణాలు తక్కువగా ఉండడంతో పాటు అమినో యాసిడ్ ఫినిలలనైన్ వల్ల కూడా చిన్న ప్రాయంలోనే తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు చిన్నతనంలోనే తెల్ల వెంట్రుకలు వచ్చినా కూడా అది వారి పిల్లలకు కూడా వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. సిగరెట్టు తాగడం అలవాటు ఉన్నవారిలో తెల్ల జుట్టు తొందరగా వచ్చే అవకాశం రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంది. హైపో లేదా హైపర్ థైరాయిడిజం ఉన్నా కూడా తొందరగా తెల్లజుట్టు వస్తుంది. థైరాయిడ్ డిజార్డర్ల వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. చాలా సందర్భాలలో ఈ డిజార్డరును తగ్గించడం ద్వారా తెల్లజుట్టు రావడాన్ని నిరోధించే అవకాశం ఉంది. ఆధునిక జీవనశైలిలోని మార్పుల కారణంగా కూడా తొందరగా తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఉంది. అలాగే పెద్ద వయసు వచ్చినా కూడా జుట్టు తెల్లబడుతుంది. 20ల ప్రారంభంలో లేదా ముఫ్ఫైల మధ్యలో చాలామంది తెల్ల జుట్టుతో బాధపడుతుంటారు. మెలనిన్ లోపం వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. ఈ సమస్య ముందే చెప్పినట్టు వంశపారంపర్యంగా కూడా తలెత్తుతుంది. అలాగే హార్మోన్ల సమస్యల వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల జుట్టులో పిగ్మెంట్ లోపిస్తుంది. అలాగే ఆటోఇమ్యూన్ జబ్బులైన విటిలిగో, రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, ప్రిమెచ్చూర్ ఏజింగ్ సిండ్రోమ్ ల వల్ల కూడా జుట్టు తెల్లబడతుంది. హెయిర్ పిగ్మెంట్స్ లోపం వల్ల తెల్లజుట్టు, గ్రే హెయిర్ వస్తుంది. హెయిర్ పిగ్మెంట్ బాగా తగ్గిపోయినపుడు గ్రే హెయిర్ వస్తుంది. శిరోజాలలో ఒక్క పిగ్మెంట్ కూడా లేకపోతే జుట్టు తెల్లగా అవుతుంది. అయితే జుట్టు తెల్లబడడానికి ఇప్పటివరకూ మూల కారణం ఏమిటో ఇంకా తేలలేదు. విటమిన్లు, ఖనిజాల లోపం వల్ల కూడా ఈ  సమస్య ఎదురవుతుంది. ఐరన్ లోపం, డి విటమిన్ లోపం, ఫొలేట్, విటమిన్ బి12, సెలినియం వంటి వాటి లోపం వల్ల కూడా తెల్ల జుట్టు వస్తుంది. ఫోలిక్ యాసిడ్ లో  బొయిటిన్ పరిమాణం తక్కువగా ఉన్నా కూడా చిన్నతనంలోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడతారు. ఒత్తిడి, రసాయనాల ఆధారిత షాంపులు, సబ్బులు, హెయిర్ డైస్ వంటివి వాడడం వల్ల కూడా తెల్లజుట్టు వస్తుంది. ఎలర్జీల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News