Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: ప్రాధాన్యత భవనాలు వేగవంతంగా పూర్తి చేయాలి

Nandyala: ప్రాధాన్యత భవనాలు వేగవంతంగా పూర్తి చేయాలి

'జగనన్న సురక్ష' విజయవంతం చేయాలి

నంద్యాల జిల్లాలో రెండవ విడతలో చేపట్టిన గ్రామాల్లో రీ సర్వే పనులను పకడ్బందీగా త్వరితగతిన పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సిఎస్ కార్యాలయం నుంచి స్పెషల్ సిఎస్, సీసీఎల్ఏ సాయి ప్రసాద్ మరియు వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి రెండవ దశ భూహక్కు మరియు రీ సర్వే, ప్రాధాన్యత భవనాలు, జగనన్నకు చెబుదాం అంశాలపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కె.ఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి ఆయా అంశాలలో ప్రగతి సాధనకు దిశా నిర్దేశం చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి, డిఆర్ఓ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో రెండవ దశ రీసర్వే పకడ్బందీగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన దశల వారి ప్రక్రియలను ఆయా కాలపరిమితిలోపు తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. ఇందులో భాగంగా గ్రౌండ్ ట్రుతింగ్, వెక్టోరైజేషన్, విలేజ్ సెక్రటరీ, విఆర్ఓ, తాసిల్దారు, ఆర్డిఓ, జెసి లాగిన్ లలో డేటా ఎంట్రీ పక్కాగా జరగాలన్నారు. ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ ని ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలన్నారు. గ్రౌండ్ ట్రూతింగ్ లో భాగంగా రెవిన్యూ రికార్డ్స్ మేరకు ప్రభుత్వ భూములను, ఎంజాయ్ మెంట్ మేరకు పట్టా ల్యాండ్ భూములను పక్కగా రీ సర్వే చేయాలన్నారు. మొదటి దశ రీసర్వేలో గుర్తించిన లోపాలను సరిదిద్దుకొని రెండవ దశను పటిష్టంగా పూర్తి చేయాలన్నారు. రీసర్వేలో భాగంగా ల్యాండ్ కన్వర్షన్, ఆధార్ సీడింగ్, ఫోటోలు మిస్ మ్యాచ్ అంశాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాలలో హద్దురాళ్లు నాటే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణ పనులు ఆగస్టు మాసాంతం లోగా పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ ద్వారా మెటీరియల్ పేమెంట్స్ ఎప్పటికప్పుడు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

- Advertisement -

జిల్లాలో నేటి నుండి ప్రారంభమైన జగనన్న సురక్ష కార్యక్రమంలో వాలంటీర్లు ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాలు, అర్హత ఉండి ఇంకా అందని ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకొని సచివాలయం వద్ద సంబంధిత అంశంపై టోకెన్ వచ్చేలా ఏర్పాటుచేసి ప్రజలకు పథకాల లబ్ది అందేలా కృషి చేయాలన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులందరూ సమన్వయంగా కృషి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ మనోహర్, డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, ల్యాండ్ అండ్ సర్వే ఎడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News