Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Shilpa: విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి

Shilpa: విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి

చదువు బాధ్యత అంతా మీ జగన్ మావయ్య చూసుకుంటున్నారు

రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి విద్యార్థి చదువు బాధ్యత అంతా మీ జగన్ మావయ్య చూసుకుంటున్నారని ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ ఉన్నత పాఠశాలలో ఆల్ మైనార్టీస్ ఎంప్లాయ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నంద్యాల డివిజన్ పరిధిలోని ఉర్దూ మీడియం పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్ పర్సన్ మాబన్నీసా చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, డిక్షనరీ అందజేసి ఘనంగా సన్మానించారు. అలాగే విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందించిన ఉపాధ్యాయులకు, ప్రోత్సాహం అందించిన విద్యార్థుల తల్లిదండ్రులను అతిథులు సన్మానించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అందుకోవాలని నంద్యాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఓటు హక్కు లేని విద్యార్ధులతో అవసరం లేదని విస్మరించారని తెలిపారు. రాష్ట్రం భవిష్యత్తులో బాగుండాలంటే విద్య ఒక్కటే మార్గమని తలచిన సీఎం జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల బంగారు చదువులకు ఎవ్వరూ, మరెక్కడా వ్యయం చేయనంతగా ఖర్చు చేశారని తెలిపారు. మీ జగన్ మావయ్య మీ చదువులకు ఎంత ఖర్చయినా వెనుకాడడని నిరూ పించారన్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, నాడు నేడు ద్వారా పాఠశాలలు, కళాశాలల ఆధునీకరణ, నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. దేశ చరిత్రలో విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారని, ఇటువంటి విజన్ ఉన్న సీఎం ను మరెన్నడు చూడలేమని తెలిపారు. అలాగే నంద్యాల నియోజక వర్గంలో విద్యాభివృద్ధికి ఆర్డిటీ వారి సహకారంతో 3.5కోట్లతో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నూతన తరగతి భవనాల నిర్మాణం, ఏపీ మోడల్ నిర్మాణం పనులు ప్రారంభం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, ఆడిటోరియం, ఉర్దూ కళాశాల స్థల సేకరణ, నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభం, ఐటిఐ కళాశాల ఏర్పాటు, అనేక పాఠశాలల రూపురేఖలను మారుస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టారు. ఉర్దూ కళాశాల అధ్యాపకుల నియామకానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉన్నత స్థానంలో ఉండాలంటే మనమిచ్చే ఆస్తి ఒక్కటేనని అది చదువు మాత్రమేనని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ బడుల్లో డిజిటల్ పాఠాలు బోధించే విధానం అమల్లోకి రానుందన్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి డా రాజశేఖర రెడ్డి ముస్లిం మైనార్టీ లకు 4శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించారని, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ఫీజ్ రీయింబర్స్ మెంట్ కల్పించారని పేర్కొన్నారు. తండ్రి బాటలోనే అంతకు మించిన కార్యక్రమాలను జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగి శెట్టి శ్రీధర్, పామ్ షా వలి, కౌన్సిలర్ అబ్దుల్ మజీద్, కో ఆప్షన్ మెంబర్ సలాముల్ల, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సిద్దం శివరాం, స్కూల్ హెచ్ఎం అసదుల్లా హుస్సేన్, ఆల్మేవా ప్రతినిధులు అబులైజ్, ఇమ్రాన్ పాష, మాలిక్ బేగ్, ముర్తుజ, అమీరుద్దీన్, షేక్ మహమ్మద్, ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News