కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో బస్తీ దవాఖానాలు.. పల్లె దవాఖాన UPHC మెడికల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో ఉన్న బస్తీ దవాఖానాల్లో ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.. ఈ నేపథ్యంలో వైద్యులు కొన్నిచోట్ల మరుగుదొడ్లు, మంచినీరు.. సిబ్బందికి సంబంధించి సమస్యలు తెలియపరచగా వెంటనే దీనిపై ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునేటట్లు అధికారులకు అక్కడ నుంచి ఆదేశాలు జారీ చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతోమంది నిరుపేదలకు అండగా నిలుస్తూ బస్తీల్లోని దవాఖానలు ఏర్పాటు చేశారని అంతేకాకుండా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఎక్కడికక్కడ ఆసుపత్రులు నిర్మిస్తూ భవిష్యత్తులో ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా నేనున్నానని భరోసా కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని అన్నారు… అలాగే కేపిహెచ్బిలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా త్వరిత గతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.. బస్తీ దవాఖానాలు.. పల్లె దవాఖానాలు ప్రజలు ఉపయోగించుకోవాలని.. వైద్యులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో డాక్టర్ చందర్ బస్తీ దవాఖాన వైద్యులు పాల్గొన్నారు…