Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Organ donation: అవయవ, శరీర దానం, మార్పిడి మీద అవగాహన ముఖ్యం

Organ donation: అవయవ, శరీర దానం, మార్పిడి మీద అవగాహన ముఖ్యం

మనిషి చనిపోయాక 230 అవయవాలు, కణాలు దానం చేయచ్చు

మనిషి చనిపోయాక మనిషి తన శరీరంలోంచి 230 అవయవాలు, కణాలను దానం చేయవచ్చు. కళ్ళు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్ద, చిన్నపేగులు, ఎముకలు, మూలుగను దానం చేయవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున పది మందికి ప్రాణ ధానం చేయవచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ‘జీవనధానం’ కార్యక్రమం చేపట్టింది.
చనిపోయాక అవయవాల మార్పిడి గంటల్లో జరిగి పోవాలి. గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె వంటి వాటిని 6 నుంచి 24 గంటల్లోపు సేకరించవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కేసుల్లో ఎక్కువగా బ్రెయిన్‌ డెత్‌గా ప్రకటిస్తారు. వీరిని వెంటిలేటర్‌ నుంచి బయటకు తీసుకొచ్చే లోపు అవయ వాలు సేకరించవచ్చు. బయటకు తీసుకొచ్చాక గుండె అయితే నాలుగైదు గంటలు, కాలేయం 8-10 గంటలు, మూత్రపిం డాలు 24 గంటల్లోపు సేకరించాల్సి ఉంటుంది. బ్రతికుండగానే అవయవాలు రక్త సంబంధీకులకు దానం చేయవచ్చు. రక్త సంబంధీకులు అంటే అమ్మానాన్న, సోదరి, బాబు, భార్య. ఇందుకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు. బతికుండగానే బంధు, మిత్రులకు అవయవదానం చేసేటప్పుడు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. ఆరోగ్యవంతులైన అన్ని వయసుల వారు అవయవదానానికి అర్హులే. తన మరణానంతరం శరీరంలోని భాగాలు ఉపయోగించుకునేలా అంగీకారం తెలపవచ్చు. బంధుమిత్రుల ఆమోదంతో వీరి శరీరంలోని అవయవాలను మార్పిడి కోసం సేకరిస్తారు. ఇటీవల కాలంలో తమ మరణా నంతరం శరీర దానం చెయడానికి అనేక మంది ముందుకు రావడం శుభ పరిణామం. దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్య సమస్యలు వున్నవారు తమ మరణం అనంతరం తమ పార్ధీవ దేహంని కాకతీయ మెడికల్‌ కాలేజ్‌, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, గాంధీ మెడికల్‌ కాలేజ్‌, మిగతా మెడికల్‌ కాలేజీలకి అందచేస్తామని తమ కుటుంబ సభ్యులకు తెలిపి అంగీకార పత్రములను అవయవ దాన, శరీర దాతల సంఘంలకి ఇస్తున్నారు. మన మరణం తర్వాత మన శరీరం దేనికి పనికి రాదు. కాల్చి వేస్తే బూడిద తప్ప ఏమి రాదు. గుంతలో పూడ్చినా మట్టి పాలవుతుంది. ఆయా వైద్య కాలేజీలో చదువుతున్న వైధ్య విద్యార్థుల శరీర భాగాల ప్రయోగముల కోసం వీని అవసరం ఎంతగానో వున్నది. జీవితంలో మనం ఒక గొప్ప పని చేసిన టువంటి తృప్తి కలుగుతుంది.మనందరం మన మరణాంతరం శరీర, అవయవ దానంకి ముందుకు రావడానికి ప్రయత్నం చేద్దాం. ప్రజల్లో వీని మీద అవగాహన కల్పించడం మన భాధ్యతగా భావించుదాం. ఈ అవయవదానం కార్యక్రమ నిర్వాహకులు శ్రవణ్‌ కుమార్‌ రాస్ట్ర అధ్యక్షుడి హోదాలో వివిధ జిల్లాల్లో అవగాహన కల్పించడంలో ముందు ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌ అధ్యక్షులు కొండి మల్లా రెడ్డి, లింగ మూర్తి, బ్రహ్మ చారి కేదారి, రాజేంద్ర ప్రసాద్‌, శంకర్‌ రావులు కూడా తమ వంతు పాత్ర నిర్వహిస్తు ఇటీవల అనేక మంది రోడ్డు ప్రమాదం లో గాయపడి మెదడు దెబ్బ తినడం, మిగతా అవయవాలు పనిచేయక కోమాలోకి వెల్లిన వారి నుండి వారి కుటుంబ సభ్యు ల ఆమోదం మేరకు వారి అవయవాలను దానం చేయుటకు ముందుకు రావడం గొప్ప విషయం. విదేశాలలో అవయవ దానం, మార్పిడి మీద ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంలో ఆయా దేశాలు ముందంజలో వున్నాయని సర్వే ల్లో వెల్లడైంది. మన దేశంలో ఈ అవయవ దానం మీద అవ గాహన కల్పించడంలో ఆయా ప్రభుత్వములు వెనకపడ్డాయి అని చెప్పవచ్చు. ఇటీవల రాజస్థాన్‌లో వీని మీద సమావేశాలు జరిగాయి. అన్ని రాష్ట్రాల నుండి ప్రతినిధులు పాల్గొని ప్రసంగిం చారు. చక్కని సలహాలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో వివిధ స్వచ్ఛంధ సంస్థలు వీని గూర్చి అవగాహన కల్పిం చడంలో తమ వంతు పాత్ర పోషించినా, ప్రభుత్వం నుండి సహకారం కొరవడింది. ప్రజలలో అవయధానం మీద అవగా హన కల్పించడంలో తెలంగాణ, నేత్ర అవయవ, శరీర దాతల సంఘం (టీ.ఈ.ఓ.బీ.డీ.యే) తన వంతుగా స్ఫూర్తిగా నిలు స్తుంది. ఇటీవల కాలంలో వరంగల్‌ కేంద్రముగా వివిధ కార ణాలతో, వృద్ధాప్యంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల అనుమతి మేరకు వారి పార్ధీవ దేహాలను కాకతీయ మెడికల్‌ కాలేజికి అందించిన ఘనత ఈ సంఘానికి దక్కుతూ వుంది. అన్ని వర్గాల వారు కూడా శరీర అవయవ దానంకి ముందుకు రావాలి.
డిమాండులు…
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శరీర అవయవాల దాతల కుటుంబాలకు తగు సహకారం అందించాలి. అన్ని మెడికల్‌ కాలేజీలలో శరీర దానం చేసే పార్థీవ దేహానికి లాంఛనంగా స్వాగతం పలకాలి. శరీర, అవయవ దాతలకు కుటుంబాలకు విద్యా, ఉద్యోగ, రంగాల్లో రిజర్వేషన్‌ కల్పించాలి. మెడికల్‌ ప్రధమ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశంలో అవయవ దానం మీద సిలబస్‌ పెట్టాలి.
-కామిడి సతీష్‌ రెడ్డి జయశంకర్‌
తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
భూపాలపల్లి జిల్లా , 9848445134
(నేడు ప్రపంచ అవయవ దాన మార్పిడి దినోత్సవం)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News