Friday, November 22, 2024
HomeతెలంగాణBajireddy: భద్రాచలంలో బాజిరెడ్డి ఫ్యామిలీ

Bajireddy: భద్రాచలంలో బాజిరెడ్డి ఫ్యామిలీ

హరిత తెలంగాణలో మొక్కను నాటారు

శ్రీ భద్రాచలం సీత రామచంద్ర మూర్తి దేవస్థానాన్ని – టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ సతీసమేతంగా కుటుంబ సభ్యులతో భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు.. దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారామచంద్రమూర్తి ఆశీస్సులు తీసుకున్నారు. టిఎస్ ఆర్టిసి సంస్థ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని, పూర్తిగా నష్టాలను దాటుకొని లాభాల వైపు పయనించాలని స్వామి వారిని ప్రార్థించారు. అనంతరం భద్రాద్రి టిఎస్ ఆర్టిసి బస్ డిపోను సందర్శించారు. ముందుగా భద్రాద్రి టిఎస్ఆర్టిసి డిపోలో హరిత తెలంగాణ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

పర్యావరణా పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. బస్ డిపోలో నిర్వహిస్తున్న కార్యకలపాలను ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహాయ సహకారాలతో టిఎస్ఆర్టిసి సంస్థ మరింత పురోగతి సాధిస్తుందని, సంస్థలో ఉన్న పెండింగ్ బకాయిలు చెల్లించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. సంస్థలో ఉన్న సిబ్బంది కష్టపడి పనిచేసి సంస్థ లాభాలకు కృషి చేయాలని సూచించారు. భద్రాద్రి స్వామి వారి దర్శనానికి వస్తున్న ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని సిబ్బందిని కోరారు. శ్రీ భద్రాద్రి రామయ్య దేవస్థానం బ్రహ్మోత్సవాలు, ప్రత్యేకమైన విశేష రోజులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని చెప్పారు. డిపోలో టిఎస్ ఆర్టిసి సంస్థ రికార్డులను పరిశీలించి EPK పెంచి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.

టిఎస్ ఆర్టిసి ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన బస్ స్టేషన్లలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఈ రక్తదాన కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని, ప్రతి ఒక్కరూ ప్రాణ దాతలుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలను పాల్గొనే విధంగా ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం టిఎస్ఆర్టిసి డిపోలో కండక్టర్స్, డ్రైవర్లతో, ప్రయాణికులతో ముచ్చటించారు. వారి యొక్క సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. డిపోను పరిశీలించిన అనంతరం ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక-ప్రణాళిక, ఒలంపిక్ సంఘ ఉపాధ్యక్షులు, జెడ్పిటిసి ధర్పల్లి బాజిరెడ్డి జగన్మోహన్ , బాజిరెడ్డి అజయ్ , డిప్యూటీ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్, భద్రాచలం డిపో మేనేజర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News