Tuesday, September 24, 2024
HomeతెలంగాణKorukanti Chander: సంక్షేమం అభివృద్ధి బాటలో దూసుకెళ్తున్నాం

Korukanti Chander: సంక్షేమం అభివృద్ధి బాటలో దూసుకెళ్తున్నాం

ప్రజల్లో తిరగని నాయకులు రాజకీయాలకు పనికిరారు

దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తూ, దేశ ప్రజల అభిమానాన్ని సంపాదించుకొని ఆయన పాలనను స్వాగతిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రామగుండంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే చందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్టణ ప్రజలు కోలాట బృందంతో ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక మజీద్ కార్నర్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే చందర్ కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాఖ్య పాలనలో కాంగ్రెస్ 70 ఏళ్లుగా పాలించిందని, తెలంగాణను అభివృద్ధికి సంక్షేమానికి దూరం పెట్టిందన్నారు. గత ప్రభుత్వంలో నిరుపేద వర్గాల ప్రజలు ఎలాంటి సంక్షేమం లేకుండా అభివృద్ధి లేకుండా జీవనం సాగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

బిపిఎల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును కూలదోసి ప్రజలను రోడ్డు మీద పడేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ శాప్ చైర్మన్ గా కొనసాగిన మక్కన్ సింగ్ రామగుండం నియోజకవర్గం ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. అభివృద్ధి నోచుకోలేక తెలంగాణ ప్రజలు తల్లడిల్లుతున్న క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ స్థాపించి అన్ని వర్గాల పోరాటాలతో ఉద్యమంతో తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సారధ్యంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు. గత ఎన్నికల్లో నాపై నమ్మకంతో గెలిపించిన ప్రజానిక సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్లోకి వచ్చి ప్రచారాలు చేయబడుతున్న నాయకులను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు వస్తేనే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోని, ప్రజల్లో తిరగని నాయకులు రాజకీయాలకు పనికిరారని ఆయన అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పని విధంగా కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు సాగుతానని ఎమ్మెల్యే అన్నారు. రామగుండం ఇంచార్జీ బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు కన్నూరి సతీష్ కుమార్, అమ్రిన్ ఫాతిమా – సలీం, దొంత శ్రీనివాస్, కొమ్ము వేణుగోపాల్, దాతు శ్రీనివాస్, బాల రాజ్ కుమార్, జనగామ కవితా సరోజిని, కల్వచర్ల కృష్ణవేణి, నాయకులు శివరాత్రి గంగాధర్, కలవల శీను, నిమ్మని సంతోష్, పల్లికొండ నరేష్, దాముఖ వంశీ, బద్రి రజిత రాజేందర్, వేణుగోపాల్, ముస్తఫా,రాజ్, శంకర్, శ్రీను, శీను, నరేష్, రమేష్, భాను, సంజీవ్, బొడ్డు రవీందర్, వేణు, జేవి రాజు, తిరుపతి నాయక్, దీటి బాలరాజు, మాదాసు రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News