Monday, November 25, 2024
Homeఆంధ్రప్రదేశ్BRS Party In AP: ఏపీలోకి త్వ‌ర‌లో బీఆర్ఎస్ ఎంట్రీ.. భారీ సంఖ్య‌లో వెలుస్తున్న ఫ్లెక్సీలు

BRS Party In AP: ఏపీలోకి త్వ‌ర‌లో బీఆర్ఎస్ ఎంట్రీ.. భారీ సంఖ్య‌లో వెలుస్తున్న ఫ్లెక్సీలు

BRS Party In AP: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన సీఎం కేసీఆర్‌.. దేశ‌వ్యాప్తంగా పార్టీని బ‌లోపేతం చేసేందుకు క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టారు. ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీని బ‌లోపేతం చేయాల‌ని దృష్టిసారించారు. ఢిల్లీ కేంద్రంగా రాజ‌కీయాలు న‌డిపే ప్లాన్లో ఉన్న తెరాస అధినేత సీఎం కేసీఆర్ .. ఈనెల 14న తాత్కాలిక బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభించ‌నున్నారు. అయితే, ఇప్ప‌టికే క‌ర్ణాటక రాష్ట్రంలో బీఆర్ఎస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంద‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. జేడీఎస్ కు తమ మద్దతు అంటూ కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కేవలం బయట నుంచి మద్దతుగా ఉంటారా? లేక బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దించుతారా? అని విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -

మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో మాత్రం కాస్త ఆచీతూచీ అడుగులు వేసే ధోరణిలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే బీఆర్ఎస్ లో చేరిక‌ల‌పై ఏపీలోని ప‌లువురు కీల‌క నేత‌ల‌తో కేసీఆర్ చ‌ర్చ‌ల జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాకుండా కేవ‌లం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోనే పోటీ చేసేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో గ‌తంలో కేసీఆర్ టీడీపీ హ‌యాంలో ఉన్న స‌మ‌యంలో త‌న‌తో స‌న్నిహితులుగా ఉన్న‌వారితో కేసీఆర్ ట‌చ్‌లోకి వెళ్లార‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రోవైపు కేసీఆర్ ఏపీ రాజ‌కీయాల్లోకి రావాల‌ని డిమాండ్ చేస్తూ ప‌లువురు ఏపీలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

గ‌తంలో బీఆర్ఎస్ పార్టీ పెడుతున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించిన కొద్దిరోజుల‌కే ఏపీలో మ‌ద్ద‌తుగా ప‌లువురు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. తాజాగా ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు స్వాగ‌తం ప‌లుకుతూ ప్లెక్సీలు వెలిశాయి. అయితే సంక్రాంతి త‌రువాత ఏపీలో సీఎం కేసీఆర్ భారీ బ‌హిరంగ స‌భను పెడ‌తార‌ని స‌మాచారం. గ‌తంలో్ ఈ మేర‌కు ప్ర‌చారంసైతం సాగింది. మ‌రి కేసీఆర్ ఏపీలో పాగావేసేలా ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది వేసి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News