Sunday, September 22, 2024
HomeతెలంగాణPailla: భూదాన్ పోచంపల్లిలో పర్యటించిన పైళ్ల

Pailla: భూదాన్ పోచంపల్లిలో పర్యటించిన పైళ్ల

డ్రైనేజి వ్యవస్థను పరిశీలించిన ఎమ్మెల్యే

భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ లోని 1,2,3 వార్డ్ లలో పర్యటించి అక్కడ జరుగుతున్న డ్రైనేజి, సీసీ రోడ్ల పనులను పర్యవేక్షించారు. అనంతరం వార్డ్ లలో నిర్మిస్తున్న డ్రైనేజి వ్యవస్థను పరిశీలించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మడుగుల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి కౌన్సిలర్లు కొంగరి కృష్ణ, దారెడ్డి మంజుల వేణుగోపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News