Saturday, October 5, 2024
HomeతెలంగాణCV Anand: డ్రగ్స్ కు దూరంగా ఉండాలి

CV Anand: డ్రగ్స్ కు దూరంగా ఉండాలి

డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

దేశవ్యాప్తంగా 11.5 కోట్ల మంది డ్రగ్స్ బారిన పడ్డారని, ప్రతి ఒక్కరూ వాటికి దూరంగా ఉండి తమ ప్రాణాలతో పాటు కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పేర్కొన్నారు. తెలంగాణలోనే తొలిసారిగా నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేశామని వెల్లడించారు. డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి జెఎన్టియు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉత్సాహంగా హాజరయ్యారు. క్యాంపస్ లోని గోడలపై గ్రాఫిటీతో పాటు ఇతర పద్దతుల్లో ఆలోచనాత్మక చిత్రాలు చిత్రించారు. తమ కళను ప్రదర్శించి సృజనాత్మకంగా అవగాహన కల్పించారు. విద్యార్థులను ఉద్దేశించి సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ నేడు నిర్వహించనున్న యాంటీ నార్కోటిక్స్ డేలో భాగంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. చూపరులను ఆలోచింప చేయడమే కాకుండా వారిని ఆకట్టుకునేలా చిత్రాలను చిత్రీకరించిన విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యుసిడిఎస్ డైరెక్టర్ శైలజ, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సీతారామ రావు, తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీలు సునీత, చక్రవర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News