Sunday, October 6, 2024
HomeతెలంగాణPilot: తాండూరు ముద్దుబిడ్డ చల్లగా ఉండాలి

Pilot: తాండూరు ముద్దుబిడ్డ చల్లగా ఉండాలి

ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు ముద్దుబిడ్డ చల్లగా ఉండాలని 8వ వార్డులో స్థానిక కౌన్సిలర్ వెంకన్న గౌడ్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ జావీద్ ఆధ్వర్యంలో ఆలయాల్లో పూజలు, చర్చ్, మజీద్ లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించగా, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నా నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉండగా నాకు ఏ ఆపాయం జరగదు, ఎల్లప్పుడు మీకు సేవలు అందిస్తానని తాండూర్ అభివృద్ధి కొరకే నేను వచ్చిన, మీకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను, ఎల్లప్పుడు మీ ఆశీస్సులు నాకు ఉండాలని కోరారు. రాబోవు రోజుల్లో తాండూర్ ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. వార్డు కౌన్సిలర్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ (వార్డు ఇంచార్జి) మాట్లాడుతూ… మొన్న జరిగిన కారు ప్రమాదంలో సురక్షితంగా మా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బయటపడినందువల్ల రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనిలో ఆలయంలో, చర్చ్, మజీద్ లో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు నిర్వహించడం జరిగింది. తాండూర్ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోరే రోహిత్ రెడ్డికి ఎల్లప్పుడూ ఆ దేవుడి అండ దండాలు ఉంటాయి. మంచికోరే వారికి మంచే జరుగుతుంది అని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్పు, హనుమాన్ దేవాలయ చైర్మన్ సాయప్ప, స్థానిక వార్డు వైస్ ప్రెసిడెంట్ బాబా సాహెబ్, సీనియర్ నాయకులు నర్సింహులు, శ్రీనివాస్ చారి, ఫయాజ్, షౌఖత్, లక్ష్మణ్ నాయక్, నదీమ్, నర్సింలు, ముంనెందర్, రాములు, మాణిక్యాం, అబ్బు, మహేష్ రెడ్డి, ఇబ్రహీం, పింటు, నిరంజన్, అలీ, చంటి, అప్సార్ యువకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News