Friday, November 22, 2024
HomeతెలంగాణKapu Bhavanam: కాపు భవన నిర్మాణానికి కేసిఆర్ సహకారం

Kapu Bhavanam: కాపు భవన నిర్మాణానికి కేసిఆర్ సహకారం

సంపూర్ణ సహకారం తప్పక అందిస్తా-కేసీఆర్ హామీ

హైదరాబాద్లో స్తిరపడ్డ ఆంధ్ర ప్రాంత వాసులు సిఎం కేసిఆర్ నాయకత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. తోట నేతృత్వంలో జంట నగరాల్లో ఉన్న కాపు సామాజికవర్గానికి చెందిన పలువురు ఐ ఏ ఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్ ఉన్నతాధికారులు, పారిశ్రామిక వేత్తల బృందం రాజకీయాలకతీతంగా సిఎం కేసిఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జంటనగరాల్లో ఉన్న కాపు, తెలగ, బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికి ఐదు ఎకరాల భూమిని మంజూరు చేసి, కాపు భవన నిర్మాణానికి పది కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని సిఎం కేసిఆర్ కు కాపు ఉన్నతాధికారుల బృందం కలసి వినతిపత్రం అందించారు . సిఎం కేసిఆర్ సానుకూలంగా స్పందిస్తూ, కాపు భవన నిర్మాణానికి తన వంతుగా సంపూర్ణ సహకారం తప్పక అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారులు డాక్టర్ చంద్రశేఖర్, రామ్ మోహన్, లక్ష్మీకాంతం,గోపాలకృష్ణ, విశ్రాంత ఐపీఎస్ అధికారులు తోట మురళీకృష్ణ , విశ్రాంత ఐఆర్ఎస్ అధికారులు పీవీ రావు , రంగిశెట్టి మంగబాబు, చింతల పార్థసారథి, పారిశ్రామిక వేత్తలు మెగాస్టార్ చిరంజీవి తోడల్లుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, టిసి అశోక్, ఆలివ్ మిఠాయి అధినేత దొరరాజు , ఎంహెచ్ రావు , శ్రీహరి , చంద్రశేఖర్ మరియు ఇతర కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News